Share News

కోహ్లీకి బౌలింగ్‌ ఇవ్వు..

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:49 AM

విరాట్‌ బ్యాటింగ్‌ చేస్తే చూడాలని ప్రతీ అభిమాని ఆశిస్తాడు. కానీ పుణె ఫ్యాన్స్‌ మాత్రం అతడి బౌలింగ్‌ విన్యాసాలను ఆశించారు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 46వ ఓవర్‌లో అశ్విన్‌ బౌలింగ్‌కు దిగుతుండగా...

కోహ్లీకి బౌలింగ్‌ ఇవ్వు..

విరాట్‌ బ్యాటింగ్‌ చేస్తే చూడాలని ప్రతీ అభిమాని ఆశిస్తాడు. కానీ పుణె ఫ్యాన్స్‌ మాత్రం అతడి బౌలింగ్‌ విన్యాసాలను ఆశించారు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 46వ ఓవర్‌లో అశ్విన్‌ బౌలింగ్‌కు దిగుతుండగా.. అటు ఫ్యాన్స్‌ మాత్రం ‘కోహ్లీకి బౌలింగ్‌ ఇవ్వండి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడం కనిపించింది. ఇక తను బౌండరీ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఆర్‌సీబీ.. ఆర్‌సీబీ అంటూ అరిచారు. విరాట్‌ తన టెస్టు కెరీర్‌ లో 14 ఓవర్లు మాత్రమే బౌలిం గ్‌ వేశాడు.

Updated Date - Oct 25 , 2024 | 01:54 AM