Share News

క్వార్టర్స్‌కు గాయత్రి జోడీ

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:53 AM

జర్మన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో గాయత్రి జంట క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ రెండో రౌండ్‌లో...

క్వార్టర్స్‌కు గాయత్రి జోడీ

జర్మన్‌ ఓపెన్‌

ముల్హిమ్‌ అన్‌ డెర్‌ రు రహ్‌ (జర్మనీ): జర్మన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో గాయత్రి జంట క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ రెండో రౌండ్‌లో నాలుగో సీడ్‌ ట్రీసా జాలీ-గాయత్రి పుల్లెల జోడీ 21-10, 21-11తో చెక్‌ జంట కత్రీనా జుజకొవా-సోనియా హొరిన్‌కొవాపై సునాయాసంగా గెలిచింది. కాగా, సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో ఆకర్షి కశ్యప్‌ 13-21, 14-21తో మియా బ్లిచ్‌ఫీల్డ్‌ (డెన్మార్క్‌) చేతిలో, సతీష్‌ కుమార్‌ కరుణాకరన్‌ 18-21, 22-24తో ఎన్హట్‌ గుయన్‌ (ఐర్లాండ్‌) చేతిలో పరాజయం పాలయ్యారు.

Updated Date - Mar 01 , 2024 | 05:53 AM