Share News

గంభీర్‌ డిమాండ్‌కు ఓకే

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:44 AM

భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా గౌతం గంభీర్‌ పేరు దాదాపు ఖరారైనట్టే. ఈ నెల చివర్లో టీ20 వరల్డ్‌కప్‌ ముగిశాక బీసీసీఐ అతడి పేరును అధికారికంగా ప్రకటించనుందని సమాచారం...

గంభీర్‌ డిమాండ్‌కు ఓకే

టీమిండియా కొత్త కోచ్‌గా ఖరారు!

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా గౌతం గంభీర్‌ పేరు దాదాపు ఖరారైనట్టే. ఈ నెల చివర్లో టీ20 వరల్డ్‌కప్‌ ముగిశాక బీసీసీఐ అతడి పేరును అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. అయితే అంతకన్నా ముందు బోర్డు ముందు గంభీర్‌ ఓ డిమాండ్‌ను పెట్టాడట. కోచ్‌గా తాను బాధ్యతలు తీసుకోవాలంటే సహాయక సిబ్బందిని కూడా తానే ఎంపిక చేసుకుంటానని స్పష్టం చేసినట్టు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు బీసీసీఐ కూడా సమ్మతించడంతోనే గంభీర్‌ కోచ్‌గా ఉండేందుకు అంగీకరించాడు.

Updated Date - Jun 17 , 2024 | 04:44 AM