Share News

French Open : అల్కారజ్‌ అదరహో

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:57 AM

ఒకరు నెం.2 సీడ్‌..మరొకరు నెం.3..ఒకరు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌..మరొకరు వింబుల్డన్‌ విజేత..దాంతో మ్యాచ్‌ అనుకున్న విధంగానే రంజుగా సాగింది..ఇద్దరూ తగ్గేదెలే అనేలా

French Open : అల్కారజ్‌ అదరహో

ఫైనల్లో స్పెయిన్‌ స్టార్‌

సెమీస్‌లో సిన్నర్‌ ఓటమి

పారిస్‌: ఒకరు నెం.2 సీడ్‌..మరొకరు నెం.3..ఒకరు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌..మరొకరు వింబుల్డన్‌ విజేత..దాంతో మ్యాచ్‌ అనుకున్న విధంగానే రంజుగా సాగింది..ఇద్దరూ తగ్గేదెలే అనేలా ఆడడంతో ఈ ఐదు సెట్ల పోరు ఉత్కంఠ రేపింది..అయితే అంతిమంగా మూడో సీడ్‌దే పైచేయి అయింది..ఇదీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్‌ జరిగిన తీరు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మూడో సీడ్‌ కార్లోస్‌ అల్కారజ్‌ (స్పెయిన్‌) 2-6, 6-3, 3-6, 6-4, 6-3తో రెండో సీడ్‌ జానిక్‌ సిన్నర్‌ (ఇటలీ)ని చిత్తు చేశాడు. 4 గంటలకుపైగా జరిగిన ఈ హోరాహోరీ పోరులో వింబుల్డన్‌ చాంపియన్‌ అల్కారజ్‌ 8 ఏస్‌లు సంధిస్తే..ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత సిన్నర్‌ 7 కొట్టాడు. సిన్నర్‌ 8, అల్కారజ్‌ 7 డబుల్‌ ఫాల్ట్స్‌ చేశారు. కార్లోస్‌ 65 విన్నర్లతో ఆధిపత్యం చెలాయిస్తే..జానిక్‌ 39కే పరిమితమయ్యాడు. అల్కారజ్‌కు రొలాండ్‌ గారో్‌సలో ఇది తొలి ఫైనల్‌. 21ఏళ్ల కార్లోస్‌..మూడు కోర్టులపై టైటిల్‌ ఫైట్‌కు చేరిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 2022లో యూఎస్‌ ఓపెన్‌ (హార్డ్‌ కోర్ట్‌), నిరుడు వింబుల్డన్‌ (గ్రాస్‌ కోర్ట్‌) టైటిళ్లు అందుకున్నాడు.

womens-final1.jpg

మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ నేడు

సా. 6.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

స్వియటెక్‌ X పౌలిని

Updated Date - Jun 08 , 2024 | 05:57 AM