French Open : స్వియటెక్ X పౌలిని
ABN , Publish Date - Jun 07 , 2024 | 05:01 AM
డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో హ్యాట్రిక్ కొట్టేందుకు మరో మ్యాచ్ దూరంలో నిలిచింది. శనివారం జరిగే మహిళ సింగిల్స్ ఫైనల్లో 12వ సీడ్ జాస్మిన్ పౌలినితో స్వియటెక్ అమీతుమీ తేల్చుకోనుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో పోలెండ్‌కు చెందిన టాప్ సీడ్ స్వియటెక్

సెమీస్ లో గాఫ్ ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో హ్యాట్రిక్ కొట్టేందుకు మరో మ్యాచ్ దూరంలో నిలిచింది. శనివారం జరిగే మహిళ సింగిల్స్ ఫైనల్లో 12వ సీడ్ జాస్మిన్ పౌలినితో స్వియటెక్ అమీతుమీ తేల్చుకోనుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో పోలెండ్‌కు చెందిన టాప్ సీడ్ స్వియటెక్ 6-2, 6-4తో మూడో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా)ను చిత్తు చేసింది. మరో సెమీ్‌సలో 12వ సీడ్ జాస్మిన్ పౌలిని (ఇటలీ) 6-3, 6-1తో అన్‌సీడెడ్ రష్యన్ టీనేజ్ సంచలనం మిరా ఆండ్రీవాపై సునాయాసంగా విజయం సాధించింది. 28 ఏళ్ల పౌలినికిది మొదటి గ్రాండ్‌స్లామ్ ఫైనల్. 2022, 2023లో చాంపియన్‌గా నిలిచిన ఇగా..ఈసారీ టైటిల్ సాధిస్తే హ్యాట్రిక్‌తో రికార్డు సృష్టిస్తుంది. ఈ విజయం రొలాండ్ గారో్‌సలో పోలెండ్ భామకు వరుసగా 20వది కావడం విశేషం. మరోవైపు గాఫ్‌పై తన రికార్డును 11-1కి స్వియటెక్ మెరుగుపరుచుకుంది. పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో ఏడో సీడ్ రూడ్ (నార్వే)తో జ్వెరెవ్ (రష్యా)తలపడతాడు. చివరి క్వార్టర్‌ఫైనల్లో జ్వెరెవ్ 6-4, 7-6 (5), 6-4తో అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)ని ఓడించాడు.
బోపన్న జోరుకు తెర..: భారత స్టార్ రోహన్ బోపన్న/మాథ్యూ ఎడ్బెన్ (ఆస్ట్రేలియా) ద్వయం జోరుకు తెరపడింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ఇటలీకి చెందిన 11వ సీడ్ సిమోన్/ఆండ్రియా ద్వయం 7-5, 2-6, 6-2తో రెండో సీడ్ బోపన్న జోడీపై గెలుపొందింది.