Share News

French Open : అల్కారజ్‌ అలవోకగా..

ABN , Publish Date - May 27 , 2024 | 04:33 AM

గత ఏడాది సెమీఫైనలిస్ట్‌ కార్లోస్‌ అల్కారజ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో సునాయాసంగా గెలుపొందాడు. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో స్పెయిన్‌ స్టార్‌ అల్కారజ్‌ 6-1, 6-2, 6-1తో అమెరికా

French Open : అల్కారజ్‌ అలవోకగా..

చెమటోడ్చిన ఒసాక

ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: గత ఏడాది సెమీఫైనలిస్ట్‌ కార్లోస్‌ అల్కారజ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో సునాయాసంగా గెలుపొందాడు. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో స్పెయిన్‌ స్టార్‌ అల్కారజ్‌ 6-1, 6-2, 6-1తో అమెరికా ఆటగాడు వోల్ఫ్‌ను చిత్తు చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఆరో సీడ్‌ రుబ్లేవ్‌ 6-2, 6-7 (7), 6-3, 7-5తో డానియల్‌పై, 10వ సీడ్‌ డిమిత్రోవ్‌ 6-4, 6-3, 6-4తో అలక్సాండర్‌పై నెగ్గి రౌండ్‌ రౌండ్‌లో అడుగుపెట్టారు. పోలెండ్‌కు చెందిన 8వ సీడ్‌ హ్యూబర్ట్‌ హుర్కాజ్‌ 4-6, 6-3, 3-6, 6-0, 6-3తో షింటారో మొచిజుకిపై నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో అన్‌సీడెడ్‌ ఒసాక 1-6, 6-4, 7-5తో లూసియా బ్రోంజెటిపై కష్టపడి నెగ్గింది. 9వ సీడ్‌ ఒస్టాపెంకో 6-4, 7-5తో క్రిస్టియన్‌పై, 18వ సీడ్‌ కొస్ట్యుక్‌ 7-5, 6-7 (7), 6-4తో పిగోసిపై, సోఫియా కెనిన్‌ 4-6, 6-2, 6-2తో సీగ్మండ్‌పై తొలి రౌండ్‌లో గెలుపొందారు.

Updated Date - May 27 , 2024 | 04:33 AM