Share News

జింబాబ్వే మాజీ క్రికెటర్‌ గై విట్టల్‌పై చిరుత దాడి

ABN , Publish Date - Apr 26 , 2024 | 03:41 AM

జింబాబ్వే మాజీ ఆల్‌రౌండర్‌ గై విట్టల్‌ (51)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన అతడి తలకు సర్జరీ చేయగా, ప్రస్తుతం కోలుకుంటున్నాడు..

జింబాబ్వే మాజీ క్రికెటర్‌ గై విట్టల్‌పై చిరుత దాడి

హరారే: జింబాబ్వే మాజీ ఆల్‌రౌండర్‌ గై విట్టల్‌ (51)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన అతడి తలకు సర్జరీ చేయగా, ప్రస్తుతం కోలుకుంటున్నాడు. హుమాని అటవీ ప్రాంతంలో విట్టల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి సఫారీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. అక్కడే ట్రెక్కింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. అయితే అతడి పెంపుడు శునకం కూడా విట్టల్‌ను రక్షించే క్ర మంలో గాయపడింది. విట్టల్‌ను, అతని శునకాన్ని హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. కాగా 2013లో ఓ అడుగు ఎత్తు మాత్రమే ఉన్న తన మంచం కిందికి 8 అడుగుల మొసలి చేరి రాత్రంతా అక్కడే ఉన్నా విట్టల్‌ బతికిపోయాడు. విట్టల్‌ 1993-2003 మధ్య 46 టెస్టులు, 147 వన్డేలు ఆడాడు.

Updated Date - Apr 26 , 2024 | 03:41 AM