Share News

సిరీ్‌సపై గురి

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:42 AM

తొలి టీ20లో అద్భుత విజయం దక్కించుకున్న హర్మన్‌ప్రీత్‌ సేన..ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌కు ఇనుమడించిన ఉత్సాహంతో సిద్ధమైంది. ఇదే ఊపులో రెండో టీ20ని కూడా...

సిరీ్‌సపై గురి

ఆసీ్‌సతో భారత మహిళల రెండో టీ20 నేడు

రా. 7.30 గం. నుంచి స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో..

నవీ ముంబై: తొలి టీ20లో అద్భుత విజయం దక్కించుకున్న హర్మన్‌ప్రీత్‌ సేన..ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌కు ఇనుమడించిన ఉత్సాహంతో సిద్ధమైంది. ఇదే ఊపులో రెండో టీ20ని కూడా చేజిక్కించుకొని మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను కైవసం చేసుకోవాలనే పట్టుదలగా ఉంది. అన్ని విభాగాల్లో పేలవమైన ప్రదర్శనతో మూడు వన్డేల సిరీస్‌లో క్లీన్‌స్వీ్‌పనకు గురైన టీమిండియా.. మొదటి టీ20లో సూపర్‌ షోతో ఆకట్టుకుంది. ఫలితంగా తొమ్మిది వికెట్లతో భారీ విజయం అందుకుంది. వన్డే సిరీ్‌సలో చెత్త ఫీల్డింగ్‌తో తీవ్ర విమర్శలపాలైన అమ్మాయిలు..తొలి టీ20లో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఏకంగా నాలుగు క్యాచ్‌లు తీసుకోవడం విశేషం. బౌలింగ్‌ విభాగంలో యువ పేసర్‌ టిటాస్‌ సాధు ఆస్ట్రేలియా బ్యాటర్లకు పూర్తిగా కళ్లెం వేసింది. స్పిన్నర్లు దీప్తిశర్మ, శ్రేయాంక పాటిల్‌ చెరో రెండేసి వికెట్లతో తమ పాత్రను సమర్థంగా నిర్వర్తించారు. బ్యాటింగ్‌లో..షఫాలీ వర్మ, స్మృతి మంధాన హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ 137 రన్స్‌ జోడించిన దరిమిలా..పొట్టి ఫార్మాట్‌లో ఆసీ్‌సపై టీమిండియా మొదటి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నమోదు చేసింది. ఇలా అన్ని విభాగాల్లో కనబరిచిన అమోఘ ప్రదర్శనను కొనసాగిస్తేనే..ఆస్ట్రేలియా స్వదేశంలో మొదటిసారి పొట్టి సిరీస్‌ విజయం లభిస్తుంది. అయితే తొలి మ్యాచ్‌లో చిత్తయినా..ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయకూడదు. పోరాటానికి మారుపేరైన ఆ జట్టు ఓటమి నుంచి బయటపడి చెలరేగడం కష్టమేమీ కాదు. పైగా..లెజెండరీ ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీకి ఈ మ్యాచ్‌ అంతర్జాతీయంగా 300వది. ఈనేపథ్యంలో రెండో టీ20 నెగ్గడం ద్వారా ఆమెకు ఘనమైన కానుక ఇవ్వాలని ఆసీస్‌ భావిస్తోంది.

Updated Date - Jan 07 , 2024 | 03:42 AM