Share News

ఫేవరెట్‌ ప్రజ్ఞానంద

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:40 AM

ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టీనేజ్‌ సంచలనం ప్రజ్ఞానంద ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. బుధవారం నుంచి జరిగే టోర్నీకి పురుషుల విభాగంలో ప్రజ్ఞానందతోపాటు గుకేష్‌, విదిత్‌ గుజరాతీ కూడా అర్హత సాధించారు...

ఫేవరెట్‌ ప్రజ్ఞానంద

  • మహిళల బరిలో హంపి

  • నేటి నుంచి క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ

టొరంటో: ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టీనేజ్‌ సంచలనం ప్రజ్ఞానంద ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. బుధవారం నుంచి జరిగే టోర్నీకి పురుషుల విభాగంలో ప్రజ్ఞానందతోపాటు గుకేష్‌, విదిత్‌ గుజరాతీ కూడా అర్హత సాధించారు. 8 మంది టాప్‌ రేటెడ్‌ గ్రాండ్‌ మాస్టర్లు బరిలో ఉన్న ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ఆటగాడికి.. వరల్డ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ను సవాల్‌ చేసే అరుదైన అవకాశం దక్కుతుంది. అంతేకాకుండా సుమారు రూ. 45 లక్షల ప్రైజ్‌మనీని కూడా గెలుచుకొంటాడు. 2023 వరల్డ్‌కప్‌ రన్నర్‌పగా ప్రజ్ఞానంద ఈ టోర్నీలో ఆడే చాన్స్‌ పట్టేశాడు. కాగా, మహిళల విభాగంలో గ్రాండ్‌ మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి బరిలో నిలవనున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 01:40 AM