Share News

ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండ్‌ షో

ABN , Publish Date - Oct 08 , 2024 | 01:13 AM

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండ్‌ షోతో టీ20 వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌ దిశగా మరో అడుగు వేసింది. సోమవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌ లో ఆ జట్టు ఏడు వికెట్లతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది....

ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండ్‌ షో

ఏడు వికెట్లతో సౌతాఫ్రికాపై గెలుపు

షార్జా : ఇంగ్లండ్‌ ఆల్‌రౌండ్‌ షోతో టీ20 వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌ దిశగా మరో అడుగు వేసింది. సోమవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌ లో ఆ జట్టు ఏడు వికెట్లతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగిన ఇంగ్లండ్‌ తొలుత సౌతాఫ్రికాను 124 పరు గులకే పరిమితం చేసింది. వోల్వార్ట్‌ (42), కాప్‌ (26) రాణించారు. డెర్క్‌సెన్‌ (11 బంతుల్లో 20 నాటౌట్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎకిల్‌స్టోన్‌ 2 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో బ్రంట్‌ (48 నాటౌట్‌), వ్యాట్‌ (43) రాణించడంతో 19.2 ఓవర్లలో 125/3 చేసి సఫారీలు నెగ్గారు.


సంక్షిప్తస్కోర్లు : సౌతాఫ్రికా 20 ఓవర్లలో 124/6 (వోల్వార్ట్‌ 42, కాప్‌ 26, ఎకిల్‌స్టోన్‌ 2/15); ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలో 125/3 (బ్రంట్‌ 48 నాటౌట్‌, వ్యాట్‌ 43, కాప్‌ 1/17, ఎం లాబా 1/22, డి క్లెర్క్‌ 1/23).

Updated Date - Oct 08 , 2024 | 01:13 AM