ఇంగ్లండ్‌దే విజయం
ABN , Publish Date - Aug 25 , 2024 | 05:47 AM
శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. శనివారం నాలుగు రోజే ముగిసిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఐదు వికెట్లతో నెగ్గింది. 205 పరుగుల ఛేదనకు రెండో ఇన్నింగ్స్...
మాంచెస్టర్: శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. శనివారం నాలుగు రోజే ముగిసిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఐదు వికెట్లతో నెగ్గింది. 205 పరుగుల ఛేదనకు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 5 వికెట్లకు అన్నే పరుగులు చేసి నెగ్గింది. జో రూట్ (62 నాటౌట్) అజేయ అర్ధశతకం సాధించాడు. అంతకుముందు లంక రెండో ఇన్నింగ్స్‌లో 326 రన్స్ చేసింది. కమిందు (113) శతకం సాధించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 358, లంక 236 రన్స్ చేశాయి.