Share News

India vs Egnland: సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్.. ముగిసిన మూడవ రోజు ఆట.. ఇంకా ఎన్ని పరుగులు కావాలంటే?

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:06 PM

భారత్, ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక జట్టు సెకండ్ ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి 5 వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ కేవలం 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో ఆధిక్యంతో కలుపుకొని భారత విజయ లక్ష్యం 192 పరుగులుగా ఉంది.

India vs Egnland: సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్..  ముగిసిన మూడవ రోజు ఆట.. ఇంకా ఎన్ని పరుగులు కావాలంటే?

రాంచీ: భారత్, ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక జట్టు సెకండ్ ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి 5 వికెట్లతో చెలరేగడం, మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లండ్ కేవలం 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మరో వికెట్ కూడా స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓవర్‌‌లోనే పడడం గమనార్హం. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో ఆధిక్యంతో కలుపుకొని భారత విజయ లక్ష్యం 192 పరుగులుగా ఉంది.

Untitled-3.jpg

ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో 60 పరుగులు చేసిన ఓపెనర్ జాక్ క్రాలే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 30 పరుగులు చేసిన బెయిర్‌స్టో సెకండ్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. మిగతా బ్యాటర్లు భారత స్పిన్నర్లు ముందు తేలిపోయారు. డకెట్ (15), ఒల్లీ పోప్ (0), జో రూట్ (11), స్టోక్స్ (4), ఫోక్స్ (17), టామ్ హార్ట్లీ (7), రాబిన్సన్ (0), షోయబ్ బషీన్ (1 నాటౌట్), జేమ్స్ అండర్సన్ (0) చొప్పున మాత్రమే పరుగులు చేశారు.

ఇక మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులు చేయగా.. భారత్ 307 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో పర్యాటక జట్టుకు 46 పరుగుల ఆధిక్యం దక్కింది.

కాగా మూడవ రోజు ఆట ముగిసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరు 40/0 వద్ద ఆట ముగిసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(24), మరో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 16 చొప్పున నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. ఆట నాలుగవ రోజున టీమిండియా మరో 152 పరుగులు సాధిస్తే రాంచీ టెస్టులో ఘనవిజయం సాధిస్తుంది.

Updated Date - Feb 25 , 2024 | 04:50 PM