Share News

మూడోరౌండ్‌కు జొకో, సబలెంకా

ABN , Publish Date - May 31 , 2024 | 05:48 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్టార్లు దూసుకుపోతున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌, రెండో సీడ్‌ సిన్నర్‌, నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ మూడో రౌండ్‌లో ప్రవేశించారు...

మూడోరౌండ్‌కు జొకో, సబలెంకా

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్టార్లు దూసుకుపోతున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌, రెండో సీడ్‌ సిన్నర్‌, నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ మూడో రౌండ్‌లో ప్రవేశించారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్‌ జొకోవిచ్‌ 6-4, 6-1, 6-2తో రాబెర్టో బెనాను చిత్తు చేశాడు. సిన్నర్‌ 6-4, 6-2, 6-4తో రిచర్డ్‌ గాస్కెట్‌పై, జ్వెరెవ్‌ 7-6 (4), 6-2, 6-2తో డేవిడ్‌ గోఫిన్‌పై, 10వ సీడ్‌ దిమిత్రోవ్‌ 6-0, 6-3, 6-4తో ఫాబియన్‌పై గెలిచారు. మాజీ విజేత వావ్రింకాకు 7-6 (5), 6-4, 1-6, 7-6 (5)తో పావెల్‌ కొటోవ్‌ షాకిచ్చాడు. మహిళల్లో రెండో సీడ్‌ సబలెంకా 6-2, 6-2తో మొయూకాని, 4వ సీడ్‌ రిబకినా 6-3, 6-4తో అరంటా రస్‌ని, 15వ సీడ్‌ స్విటోలినా 6-4, 7-6 (3)తో డ్యానీ ప్యారీని ఓడించి మూడోరౌండ్‌ చేరారు. కాగా, మాజీ విజేత, 9వ సీడ్‌ వోస్తాపెంకో 6-7(4-7), 6-4, 3-6తో క్లారా టౌసన్‌ చేతిలో ఓటమిపాలైంది.

Updated Date - May 31 , 2024 | 05:48 AM