Share News

విమానం దారి మళ్లింపు.. కేకేఆర్‌ ఆటగాళ్ల తిప్పలు

ABN , Publish Date - May 08 , 2024 | 03:58 AM

ప్రతికూల వాతావరణం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కోల్‌కతాలో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించక పోవడంతో...

విమానం దారి మళ్లింపు.. కేకేఆర్‌ ఆటగాళ్ల తిప్పలు

న్యూఢిల్లీ: ప్రతికూల వాతావరణం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కోల్‌కతాలో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించక పోవడంతో వారు ప్రయాణిస్తున్న చార్టర్డ్‌ ఫ్లయిట్‌ను రెండుసార్లు దారి మళ్లించాల్సి వచ్చింది. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన మ్యాచ్‌ తర్వాత కేకేఆర్‌ జట్టు సోమవారం సాయంత్రం కోల్‌కతా బయల్దేరింది. అయితే, ప్రతికూల వాతావరణం వల్ల విమానాన్ని తొలుత గువాహటికి మళ్లించినట్టు కేకేఆర్‌ ఫ్రాంచైజీ ఎక్స్‌లో తెలిపింది. ఆ తర్వాత క్లియరెన్స్‌ రావడంతో రాత్రి 9.43 నిమిషాలకు కోల్‌కతా బయల్దేరిన విమానాన్ని భారీ వర్షం కారణంగా వారణాశికి మళ్లించారు. రాత్రికి అక్కడే బస చేసిన శ్రేయాస్‌ అయ్యర్‌ సేన.. కాశీ విశ్వనాథుడిని సందర్శించుకొన్న అనంతరం మంగళవారం క్షేమంగా కోల్‌కతా చేరుకొంది.

Updated Date - May 08 , 2024 | 03:58 AM