Share News

ట్రయల్స్‌లో ధీరజ్‌ టాప్‌

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:39 AM

ప్రపంచకప్‌, పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం నిర్వహించిన ఆర్చరీ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌ అదరగొట్టాడు. భారత్‌కు ఇప్పటికే ఒక ఒలింపిక్‌ కోటా అందించిన ధీరజ్‌.. ఆదివారం ఇక్కడ జరిగిన ట్రయల్స్‌లో పురుషుల రికర్వ్‌ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. టీమ్‌ ఈవెంట్‌లో ధీరజ్‌తో పాటు తరుణ్‌దీప్‌, ప్రవీణ్‌,

ట్రయల్స్‌లో ధీరజ్‌ టాప్‌

సోనెపట్‌: ప్రపంచకప్‌, పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం నిర్వహించిన ఆర్చరీ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌ అదరగొట్టాడు. భారత్‌కు ఇప్పటికే ఒక ఒలింపిక్‌ కోటా అందించిన ధీరజ్‌.. ఆదివారం ఇక్కడ జరిగిన ట్రయల్స్‌లో పురుషుల రికర్వ్‌ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. టీమ్‌ ఈవెంట్‌లో ధీరజ్‌తో పాటు తరుణ్‌దీప్‌, ప్రవీణ్‌, మృణాల్‌ సత్తాచాటారు. ఇక, మహిళల రికర్వ్‌ విభాగంలో దీపికా కుమారి టాప్‌లో నిలవగా.. భజన్‌ కౌర్‌, అంకిత, కోమలిక టీమ్‌ ఈవెంట్‌లో రాణించారు. నాన్‌ ఒలింపిక్‌ కేటగిరి అయిన కాంపౌండ్‌ విభాగం నుంచి తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది వరల్డ్‌ కప్‌లో భాగంగా స్టేజ్‌-1 పోటీలు ఏప్రిల్‌ 21 నుంచి షాంఘై (చైనా)లో, స్టేజ్‌-2 ఈవెంట్‌ మే 21 ఇంచియాన్‌ (దక్షిణ కొరియా), స్టేజ్‌-3 పోటీలు జూన్‌ 18 నుంచి అంటాల్యా (టర్కీ)లో జరుగుతాయి. ట్రయల్స్‌లో సత్తా చాటిన ఆర్చర్లనే ఈ వరల్డ్‌ కప్‌ పోటీలకు ఎంపిక చేశారు.

Updated Date - Mar 18 , 2024 | 04:39 AM