Share News

ఎలిమినేటర్‌లో ఢిల్లీ X అహ్మదాబాద్‌

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:30 AM

అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌, ఢిల్లీ తుఫాన్స్‌ జట్లు ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ ఎలిమినేటర్‌లో ప్రవేశించాయి. ఆదివారం జరిగిన ఈ సీజన్‌ ఆఖరి సూపర్‌-5 మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ జట్టు 3-2తో కాలికట్‌ హీరోస్‌పై విజయం

ఎలిమినేటర్‌లో ఢిల్లీ  X అహ్మదాబాద్‌

చెన్నై: అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌, ఢిల్లీ తుఫాన్స్‌ జట్లు ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ ఎలిమినేటర్‌లో ప్రవేశించాయి. ఆదివారం జరిగిన ఈ సీజన్‌ ఆఖరి సూపర్‌-5 మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ జట్టు 3-2తో కాలికట్‌ హీరోస్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన నామమాత్రమైన సూపర్‌-5 మ్యాచ్‌లో ముంబై మీటియర్స్‌ 3-1తో ఢిల్లీ తుఫాన్స్‌పై నెగ్గింది. కాగా, ఎలిమినేటర్‌లో నెగ్గిన జట్టు.. ఇప్పటికే ఫైనల్‌ చేరిన కాలికట్‌ హీరోస్‌తో ట్రోఫీ కోసం తలపడనుంది. ఈనెల 19న ఎలిమినేటర్‌, 21న ఫైనల్‌ జరగనుంది.

Updated Date - Mar 18 , 2024 | 04:32 AM