Share News

DC vs RR: టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న డీసీ.. తుది జట్లు ఇవే

ABN , Publish Date - Mar 28 , 2024 | 07:18 PM

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా.. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. సాయంత్రం 7 గంటలకు టాస్ వేయగా.. ఢిల్లీ జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకూ చెరో మ్యాచ్ ఆడాయి.

DC vs RR: టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న డీసీ.. తుది జట్లు ఇవే

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా.. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. సాయంత్రం 7 గంటలకు టాస్ వేయగా.. ఢిల్లీ జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకూ చెరో మ్యాచ్ ఆడాయి. రాజస్థాన్ తొలి మ్యాచ్‌లో విజయకేతనం ఎగరేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ఓటమితో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీ జట్టు బోణీ కొట్టాలని చాలా కసిగా ఉంది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓటమిపాలైన ఢిల్లీ.. ఈసారి ఎలాగైనా గెలుపొందాల్సిందేనని కంకణం కట్టుకుంది. అటు.. రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటి, తన జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది. మరి.. ఈ ఇరు జట్ల మధ్య సాగనున్న పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.


రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, జాస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్‌మేయర్, ధ్రువ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, రిక్కీ భుయి, రిషభ్ పంత్, ట్రిస్టాన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్ట్యే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్

Updated Date - Mar 28 , 2024 | 07:18 PM