Share News

ఢిల్లీ.. భళా

ABN , Publish Date - Mar 11 , 2024 | 02:37 AM

డబ్ల్యూపీఎల్‌లో ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక్క పరుగు తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. 7 మ్యాచ్‌ల నుంచి 10 పాయింట్లతో టాప్‌నకు...

ఢిల్లీ.. భళా

నేటి మ్యాచ్‌

గుజరాత్‌ X యూపీ, రాత్రి 7.30 గం. నుంచి

  • ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు

  • బెంగళూరుపై

ఉత్కంఠ గెలుపు

న్యూఢిల్లీ: డబ్ల్యూపీఎల్‌లో ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక్క పరుగు తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. 7 మ్యాచ్‌ల నుంచి 10 పాయింట్లతో టాప్‌నకు ఎగబాకిన ఢిల్లీ ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకొంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెమీమా రోడ్రిగ్స్‌ (58), అలిస్‌ క్యాప్సీ (48) మూడో వికెట్‌కు 62 బంతుల్లోనే 97 పరుగులు జోడించడంతో.. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 181/5 స్కోరు చేసింది. లానింగ్‌ (29), షఫాలీ (23) రాణించారు. శ్రేయాంక 4 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో బెంగళూరు ఓవర్లన్నీ ఆడి 180/7 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. మోలినెక్స్‌ (33), పెర్రీ (49) రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. పెర్రీ, మోలినెక్స్‌ తర్వాత డివైన్‌ (26), రిచా ఘోష్‌ (51) బ్యాట్‌లు ఝుళిపించడంతో లక్ష్యం వేగంగా కరిగింది. చివరి ఓవర్‌లో బెంగళూరు గెలుపునకు 17 రన్స్‌ అవసరమవగా, రెండు సిక్స్‌లతో జోరు చూపిన రిచా గెలుపుగీతను మాత్రం దాటలేకపోయింది. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా.. రిచా సింగిల్‌ కోసం ప్రయత్నించి రనౌటవడంతో బెంగళూరుకు నిరాశ తప్పలేదు.

సంక్షిప్త స్కోర్లు

ఢిల్లీ: 20 ఓవర్లలో 181/5 (జెమీమా 58, క్యాప్సీ 48; పాటిల్‌ 4/26).

బెంగళూరు: 20 ఓవర్లలో 180/7 (రిచా 51, పెర్రీ 49; క్యాప్సీ 1/5, కాప్‌ 1/30).

Updated Date - Mar 11 , 2024 | 02:37 AM