Share News

టైటాన్స్‌కు పరాజయం

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:26 AM

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో తొలి మ్యాచ్‌లో విజయంతో శుభారంభం చేసిన తెలుగు టైటాన్స్‌కు రెండో మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. శనివారం ఇక్కడి గచ్చిబౌలీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో...

టైటాన్స్‌కు పరాజయం

  • పీకేఎల్‌లో తలైవాస్‌ బోణీ

హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో తొలి మ్యాచ్‌లో విజయంతో శుభారంభం చేసిన తెలుగు టైటాన్స్‌కు రెండో మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. శనివారం ఇక్కడి గచ్చిబౌలీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 29-44తో తమిళ తలైవాస్‌ చేతిలో చిత్తయింది. తలైవాస్‌ రైడర్లు నరేందర్‌ ఖండోలా, సచిన్‌ సూపర్‌-10లు సాధించగా.. సాహిల్‌ గులియా 5 టాకిలింగ్స్‌ చేశాడు. కాగా, టైటాన్స్‌ కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ 10 పాయింట్లు స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. ఇక, ఆడిన తొలి మ్యాచ్‌లోనే గెలిచి తలైవాస్‌ లీగ్‌లో అద్భుత బోణీ చేసింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణెరి పల్టన్‌ 35-25తో హరియాణా స్టీలర్స్‌ను చిత్తుచేసింది. డిఫెండర్‌ గౌరవ్‌ ఖత్రి ఏడు పాయింట్లతో పుణెరి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Updated Date - Oct 20 , 2024 | 01:26 AM