Share News

డికాక్‌ పోరాటం

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:38 AM

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ డికాక్‌ ఆటే హైలైట్‌గా నిలిచింది. పిచ్‌ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించకపోయినా.. అతను ఎదురుదాడికి దిగగా, చివర్లో పూరన్‌ సైతం చెలరేగడంతో భారీ స్కోరు సాధ్యమైంది..

డికాక్‌ పోరాటం

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ డికాక్‌ ఆటే హైలైట్‌గా నిలిచింది. పిచ్‌ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించకపోయినా.. అతను ఎదురుదాడికి దిగగా, చివర్లో పూరన్‌ సైతం చెలరేగడంతో భారీ స్కోరు సాధ్యమైంది. మిగతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు కష్టపడ్డారు. తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లతో వేగం కనబర్చిన డికాక్‌ ఆ తర్వాత కూడా ధాటి కొనసాగించాడు. అటు కెప్టెన్‌ రాహుల్‌ (20) కూడా రెండేసి సిక్సర్లతో టచ్‌లో ఉన్నట్టు కనిపించినా మ్యాక్స్‌వెల్‌ ఓవర్‌లో అవుటయ్యాడు. తొలి వికెట్‌కు వీరి మధ్య 53 పరుగులు జత చేరాయి. దేవ్‌దత్‌ (6) తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. అయితే డికాక్‌కు స్టొయినిస్‌ (24) జత కలిశాక స్కోరుబోర్డు వేగంగా కదిలింది. 12వ ఓవర్‌లో డికాక్‌ 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఆ వెంటనే గ్రీన్‌ ఓవర్‌లో స్టొయినిస్‌ 6,6 డికాక్‌ 4తో 19 రన్స్‌ సమకూరాయి. కానీ స్టొయిని్‌సను మ్యాక్స్‌వెల్‌ దెబ్బతీయడంతో మూడో వికెట్‌కు 56 పరుగుల భాగస్వా మ్యం ముగిసింది. సిరాజ్‌ ఓవర్‌లో మరో రెండు ఫోర్లతో డికాక్‌ 80 పరుగులకు చేరి సెంచరీ వైపు కదిలాడు. అయితే టోప్లే ఫుల్‌టాస్‌ బంతికి అతడు దాగర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 15-18 ఓవర్ల మధ్య బౌలర్లు యష్‌ దయాల్‌, టోప్లే రన్స్‌ కట్టడి చేశారు. దీంతో బ్యాట్‌ ఝుళిపించిన పూరన్‌ 19వ ఓవర్‌లో 3 సిక్సర్లతో 20 పరుగులు, ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లతో 13 రన్స్‌ అందించడంతో స్కోరు 180 దాటింది.

Updated Date - Apr 03 , 2024 | 01:38 AM