Share News

Australia vs Pakistan: మ్యాచ్‌లో నో-బాల్ డ్రామా.. 10 బంతుల తర్వాత మళ్లీ అదే రిపీట్

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:12 PM

అప్పుడప్పుడు క్రికెట్ మైదానంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతుంటాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో అనుకోని పరిణామాలు వెలుగు చూస్తుంటాయి. ఇప్పుడు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా...

Australia vs Pakistan: మ్యాచ్‌లో నో-బాల్ డ్రామా.. 10 బంతుల తర్వాత మళ్లీ అదే రిపీట్

Australia vs Pakistan: అప్పుడప్పుడు క్రికెట్ మైదానంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతుంటాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో అనుకోని పరిణామాలు వెలుగు చూస్తుంటాయి. ఇప్పుడు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లోనూ అలాంటి సందర్భమే చోటు చేసుకుంది. మొదట్లో వికెట్ తీసినప్పుడు అది నో-బాల్ అని తేలింది. దీంతో డిజప్పాయింట్ అయిన బౌలర్.. తిరిగి పది బంతుల తర్వాత తన అతని వికెట్ పడగొట్టి, తన పగ తీర్చుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆటలో భాగంగా.. పాకిస్తాన్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా 26వ ఓవర్ వేసిన మిచెల్ మార్షన్.. ఐదో బంతికే పాక్ కెప్టెన్ షాన్ మసూద్ వికెట్ తీశాడు. మార్షన్ వేసిన బంతిని పసిగట్టలేకపోయిన మసూద్, డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొని, నేరుగా సెకండ్ స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ చేతికి వెళ్లింది. దాంతో.. మసూద్ వికెట్ పడిందని ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాలు జరుపుకున్నారు. కానీ.. ఇంతలోనే అంపైర్ బాంబ్ పేల్చాడు. అది నో-బాల్ అని ఆయన ప్రకటించాడు. దీంతో.. ఆసీస్ ఆటగాళ్లు బాగా డిజప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా.. మార్ష్ అయితే నిరుత్సాహానికి గురయ్యాడు.

అయితే.. 10 బంతుల తర్వాత మార్ష్ తాను చేసిన తప్పుని సరిదిద్దుకున్నాడు. ఈసారి నో-బాల్ వేయకుండా, షాన్ మసూద్ వికెట్ తీశాడు. మర్ష్ మళ్లీ అలాంటి బంతినే వేయడంతో, షాన్ మసూద్ దాన్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ.. అది బ్యాట్ అంచుకి తగిలి, రెండో స్లిప్‌లో ఉన్న స్మిత్ వద్దకు వెళ్లింది. దాంతో అతడు దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. ఈసారి వికెట్ తీయడంలో సక్సెస్ అవ్వడంతో.. మార్ష్‌తో పాటు ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లు దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. చివరగా.. మార్ష్ చిరునవ్వులు చిందిస్తూ, ఈసారి నో-బాల్ వేయలేదని అంపైర్‌కి హై-ఫైవ్ ఇవ్వబోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Updated Date - Jan 03 , 2024 | 03:12 PM