Share News

శాట్జ్‌ కొత్త లోగో ఆవిష్కరణ

ABN , Publish Date - Aug 23 , 2024 | 06:04 AM

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్జ్‌) కొత్త లోగోను సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌కు కొత్త లోగో విశిష్టతను ప్రభుత్వ క్రీడా శాఖ సలహాదారుడు

శాట్జ్‌ కొత్త లోగో ఆవిష్కరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్జ్‌) కొత్త లోగోను సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌కు కొత్త లోగో విశిష్టతను ప్రభుత్వ క్రీడా శాఖ సలహాదారుడు ఏపీ జితేందర్‌ రెడ్డి, శాట్జ్‌ చైర్మన్‌ శివసేనా రెడ్డి వివరించారు. ఐదు వర్ణాలతో ఒలింపిక్‌ జ్యోతి, క్రీడారంగ ప్రాముఖ్యాన్ని ప్రతిబింబించేలా కొత్త లోగోను రూపొందించారు. తెలంగాణ నూతన క్రీడా చరిత్రకు ఇది నాంది కావాలని రేవంత్‌ ఆకాంక్షించారు. లోగో ఆవిష్కరణలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాట్జ్‌ వీసీ-ఎండీ సోనీబాలాదేవి కూడా పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2024 | 06:04 AM