Share News

చైనాకు షాకిచ్చారు

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:57 AM

రీఎంట్రీలో పీవీ సింధు అదరగొట్టడంతో.. బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ చాంపియన్‌షి్‌పను భారత మహిళల జట్టు ఘనంగా ఆరంభించింది. బుధవారం జరిగిన గ్రూప్‌-డబ్ల్యూ మ్యాచ్‌లో పటిష్ట చైనాపై భారత్‌ 3-2తో గెలిచి...

చైనాకు షాకిచ్చారు

  • భారత అమ్మాయిల విక్టరీ

  • ఘనంగా సింధు రీఎంట్రీ

  • నాకౌట్‌కు పురుషుల జట్టు

  • ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌

షా ఆలమ్‌ (మలేసియా): రీఎంట్రీలో పీవీ సింధు అదరగొట్టడంతో.. బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ చాంపియన్‌షి్‌పను భారత మహిళల జట్టు ఘనంగా ఆరంభించింది. బుధవారం జరిగిన గ్రూప్‌-డబ్ల్యూ మ్యాచ్‌లో పటిష్ట చైనాపై భారత్‌ 3-2తో గెలిచి సంచలనం సృష్టించింది. ఈ గ్రూప్‌లో రెండే జట్లు ఉండడంతో ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు నాకౌట్‌ బెర్త్‌ ఖరారైంది. 11వ ర్యాంకర్‌ సింధు 21-17, 21-15తో తనకంటే మెరుగైన 8వ ర్యాంకర్‌ హన్‌ యుపై గెలిచి భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపింది. అయితే, అశ్విని పొన్నప్ప-తనీషా జంట 19-21, 16-21తో లి షంగ్‌-టాన్‌ నింగ్‌ చేతిలో, అస్మిత 13-21, 15-21తో వాంగ్‌ జి యి చేతిలో ఓడారు. కానీ, ట్రీసా జోలీ-గాయత్రి జోడీ 10-21, 21-18, 21-17తో లి యి జింగ్‌- లు జుపై గెలిచి 2-2తో సమం చేసింది. నిర్ణాయక మ్యాచ్‌లో అన్‌మోల్‌ కర్బ్‌ 22-20, 14-21, 21-18తో ఉ లు యుపై నెగ్గడంతో భారత్‌ 3-2 ఆధిక్యంతో ముందంజ వేసింది. ఇక, పురుషుల జట్టు కూడా నాకౌట్‌ బెర్త్‌ను ఖాయం చేసుకొంది. గ్రూప్‌-ఎలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-1తో హాంకాంగ్‌పై గెలిచింది. తొలి సింగిల్స్‌లో ప్రణయ్‌ 18-21, 14-21తో ఎన్‌జి కా లాంగ్‌ అంగస్‌ చేతిలో ఓడగా, డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-16, 21-11తో లి వయ్‌-చోయ్‌పై నెగ్గి సమం చేసింది. లక్ష్య సేన్‌ 21-14, 21-9తో చాన్‌పై, అర్జున్‌-ధ్రువ్‌ జోడీ 21-12, 21-7తో లాంగ్‌-హంగ్‌పై, కిడాంబి శ్రీకాంత్‌ 21-14, 21-18తో గునవాన్‌పై గెలిచారు. గురువారం చైనాతో భారత్‌ తలపడనుంది.

Updated Date - Feb 15 , 2024 | 03:57 AM