Share News

హైదరాబాద్‌లో రేపటి నుంచి చెస్‌ టోర్నీలు

ABN , Publish Date - Apr 12 , 2024 | 03:02 AM

హైదరాబాద్‌కు చెందిన వారస్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి జూన్‌ రెండు వరకు వివిధ స్థాయిల చెస్‌ టోర్నీలు నిర్వహిస్తున్నారు...

హైదరాబాద్‌లో రేపటి నుంచి చెస్‌ టోర్నీలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన వారస్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి జూన్‌ రెండు వరకు వివిధ స్థాయిల చెస్‌ టోర్నీలు నిర్వహిస్తున్నారు. 13 ఏళ్ల లోపు చిన్నారులకు ఈనెల 13న చిల్డ్రన్స్‌ కప్‌, అలాగే 14వ తేదీన అండర్‌-15 ర్యాపిడ్‌ ఓపెన్‌ పోటీలను ఉప్పల్‌ డెకాథ్లాన్‌ వేదికగా నిర్వహించనున్నట్టు అకాడమీ ఫౌండర్‌-చీఫ్‌ కోచ్‌ రాఘవ్‌ శ్రీవాత్సవ్‌ తెలిపారు. ఇతర వివరాలకు 7396847937 నెంబర్‌లో సంప్రదించాలి.

Updated Date - Apr 12 , 2024 | 03:03 AM