చెన్నై చమక్
ABN , Publish Date - May 13 , 2024 | 12:49 AM
కీలక పోరులో చెన్నై సత్తా చాటింది. స్వస్థలంలో ఈ సీజన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌తోపై ఐదు వికెట్లతో నెగ్గిన సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది...
ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
ఐదు వికెట్లతో రాజస్థాన్‌పై విజయం
రాణించిన సిమర్‌జీత్, రుతురాజ్
చెన్నై: కీలక పోరులో చెన్నై సత్తా చాటింది. స్వస్థలంలో ఈ సీజన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌తోపై ఐదు వికెట్లతో నెగ్గిన సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఆదివారం జరిగిన స్వల్ప స్కోర్ల పోరులో మొదట రాజస్థాన్ 20 ఓవర్లలో 141/5 స్కోరుకే పరిమితమైంది. రియాన్ పరాగ్ (47 నాటౌట్) టాప్ స్కోరర్. జురెల్ (28), జైస్వాల్ (24) పర్లేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిమర్‌జీత్ సింగ్ మూడు వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. తుషార్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో చెన్నై 18.2 ఓవర్లలో 145/5 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్ రుతురాజ్ (42 నాటౌట్) అజేయంగా నిలవగా, రచిన్ (27), మిచెల్ (22) రాణించారు. అశ్విన్ రెండు వికెట్లు సాధించాడు. ఈ విజయంతో 14 పాయింట్లతో చెన్నై మూడో స్థానానికి చేరింది.
దూకుడైన ఆరంభం: బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో రచిన్ 4,6 బాదడంతో చెన్నై ఛేదన దూకుడుగా సాగింది. నాలుగో ఓవర్లో రచిన్‌ను అశ్విన్ అవుట్ చేసి చెన్నైకి షాకిచ్చాడు. కానీ మిచెల్ బౌండరీలతో హోరెత్తించగా, ఆచితూచి ఆడిన రుతురాజ్ అతడితో కలిసి రెండో వికెట్‌కు 35 పరుగులు జత చేశాడు. మిచెల్‌ను స్పిన్నర్ చాహల్ ఎల్బీ చేయగా..మొయిన్ (10) కూడా త్వరగా నిష్క్రమించాడు. శివమ్ దూబే (18) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించగా..జడేజా అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ (ఫీల్డర్‌ను అడ్డుకున్నందుకు)గా రనౌటయ్యాడు. ఆపై సమీర్ రిజ్వీ (15 నాటౌట్) జతగా రుతురాజ్ చెన్నైను విజయ తీరాలకు చేర్చాడు.
దెబ్బ కొట్టిన సిమర్‌జీత్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌కు స్లో పిచ్‌పై పరుగులు చేయడం కష్టమైంది. ఓపెనర్లు జైస్వాల్, బట్లర్ ఆచితూచి ఆడి తొలి వికెట్‌కు 43 రన్స్ జోడించారు. పవర్ ప్లే తర్వాత బౌలింగ్ చేపట్టిన సమర్‌జీత్ సింగ్..తన వరుస ఓవర్లలో తొలుత జైస్వాల్‌ను, ఆపై బట్లర్‌ను అవుట్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ శాంసన్, పరాగ్ మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. 15 ఓవర్లో సంజూ (15)ను పెవిలియన్ చేర్చిన సిమర్‌జీత్ మరోసారి ప్రత్యర్థికి ఝలకిచ్చాడు. ఆపై జురెల్-పరాగ్ నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించినా.. వేగంగా రన్స్ రాబట్టలేకపోయారు. ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో జురెల్, శుభమ్ దూబే (0)ను తుషార్ అవుట్ చేయడంతో రాజస్థాన్ స్కోరు కనీసం150 కూడా చేరలేదు.
స్కోరుబోర్డు
రాజస్థాన్: జైస్వాల్ (సి) రుతురాజ్ (బి) సిమర్‌జీత్ 24, బట్లర్ (సి) తుషార్ (బి) సిమర్‌జీత్ 21, శాంసన్ (సి) రుతురాజ్ (బి) సిమర్‌జీత్ 15, పరాగ్ (నాటౌట్) 47, జురెల్ (సి) శార్దూల్ (బి) తుషార్ 28, శుభమ్ దూబే (సి) శివమ్ దూబే (బి) తుషార్ 0, అశ్విన్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 141/5; వికెట్లపతనం: 1-43, 2-49, 3-91, 4-131, 5-131; బౌలింగ్: తుషార్ దేశ్‌పాండే 4-0-30-2, తీక్షణ 4-0-28-0, శార్దూల్ 4-0-32-0, సిమర్‌జీత్ సింగ్ 4-0-26-3, జడేజా 4-0-24-0.
చెన్నై: రచిన్ (సి అండ్ బీ) అశ్విన్ 27, రుతురాజ్ (నాటౌట్) 42, మిచెల్ (ఎల్బీ) చాహల్ 22, మొయిన్ (సి) అవేశ్ (బి) బర్గర్ 10, శివమ్ దూబే (సి) పరాగ్ (బి) అశ్విన్ 18, జడేజా (అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్) 5, సమీర్ రిజ్వీ (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 18.2 ఓవర్లలో 145/5; వికెట్లపతనం: 1-32, 2-67, 3-86, 4-107, 5-121; బౌలింగ్: బౌల్ట్ 2.2-0-24-0, సందీప్ శర్మ 3-0-30-0, అశ్విన్ 4-0-35-2, నాండ్రే బర్గర్ 3-0-21-1, చాహల్ 4-0-22-1, అవేశ్ ఖాన్ 2-0-12-0.