Share News

డ్రెస్‌ కోడ్‌ పాటించని.. కార్ల్‌సన్‌పై అనర్హత వేటు

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:31 AM

ఐదుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు చేదు అనుభవం ఎదురైంది. డ్రెస్‌ కోడ్‌ను పాటించనందుకు అతడిపై ఏకంగా అనర్హత వేటు పడింది. డిఫెండింగ్‌ చాంప్‌ అయిన కార్ల్‌సన్‌.. వరల్డ్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నీకి జీన్స్‌ ధరించి...

డ్రెస్‌ కోడ్‌ పాటించని.. కార్ల్‌సన్‌పై అనర్హత వేటు

న్యూయార్క్‌: ఐదుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు చేదు అనుభవం ఎదురైంది. డ్రెస్‌ కోడ్‌ను పాటించనందుకు అతడిపై ఏకంగా అనర్హత వేటు పడింది. డిఫెండింగ్‌ చాంప్‌ అయిన కార్ల్‌సన్‌.. వరల్డ్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నీకి జీన్స్‌ ధరించి వచ్చాడు. అయితే, డ్రెస్‌ మార్చుకుని రావాలని చీఫ్‌ ఆర్బిటర్‌ చెప్పినా ససేమిరా అన్నాడు. దీంతో నిర్వాహకులు అతడిపై అనర్హత వేటు వేశారు.


9-Sp.jpg

టాప్‌లో అర్జున్‌..: ఇదే టోర్నీలో బరిలో నిలిచిన అర్జున్‌ ఇరిగేసి 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆడిన 9 రౌండ్లలో ఆరు గెలిచిన అర్జున్‌.. రెండు గేమ్‌లను డ్రా చేసుకొన్నాడు. ఒక్క గేమ్‌లో మాత్రమే ఓడాడు. ఇక, మహిళల విభాగంలో హంపి, హారిక కూడా చెరో 6.5 పాయింట్లతో సంయుక్తంగా టాప్‌లో నిలిచారు. ఆడిన 8 రౌండ్లలో ఆరు గెలిచిన హంపి.. ఒకటి డ్రా చేసుకొంది. మరోవైపు హారిక ఓటమి లేకుండా సాగుతోంది. మరో మూడు రౌండ్లు మాత్రమే మిగిలిన నేపథ్యంలో భారత్‌కు పతకం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Updated Date - Dec 29 , 2024 | 05:31 AM