Share News

భారత్‌ను ఆపతరమా?

ABN , Publish Date - Oct 16 , 2024 | 05:33 AM

ఓవైపు సొంత గడ్డపై వరుసగా 18 టెస్టు సిరీ్‌సలను ఖాతాలో వేసుకున్న టీమిండియా..మరోవైపు స్వదేశంలో ఆసీ్‌సపై, తర్వాత శ్రీలంక టూర్‌లోనూ వైట్‌వా్‌షకు గురై ఆత్మవిశ్వాసం పూర్తిగా అడుగంటిన న్యూజిలాండ్‌ జట్టు. ఇప్పుడీ రెండు జట్లమధ్య ...

భారత్‌ను ఆపతరమా?

జోరు మీదున్న రోహిత్‌ సేన

వరుస ఓటములతో కివీస్‌

నేటి నుంచి తొలి టెస్టు

ఉదయం 9.30 నుంచి స్పోర్ట్స్‌18లో..

బెంగళూరు: ఓవైపు సొంత గడ్డపై వరుసగా 18 టెస్టు సిరీ్‌సలను ఖాతాలో వేసుకున్న టీమిండియా..మరోవైపు స్వదేశంలో ఆసీ్‌సపై, తర్వాత శ్రీలంక టూర్‌లోనూ వైట్‌వా్‌షకు గురై ఆత్మవిశ్వాసం పూర్తిగా అడుగంటిన న్యూజిలాండ్‌ జట్టు. ఇప్పుడీ రెండు జట్లమధ్య మూడు టెస్టుల సిరీ్‌సకు సమయం ఆసన్నమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు జరుగనుంది. అన్ని విభాగాల్లో దూకుడుమీదున్న రోహిత్‌ సేనను కివీస్‌ ఏమేరకు అడ్డుకోగలుతుందనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. కీలక ప్లేయర్లు గాయాలతో దూరమైన వేళ పర్యాటక జట్టు తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. కివీస్‌ ఇప్పటివరకు భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవకపోవడం గమనార్హం. మరోవైపు ఇటీవలే బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌ దక్కించుకున్న భారత జట్టు రెట్టించిన ఉత్సాహంతో కివీ్‌సను కకావికలం చేయాలనుకుంటోంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌లో చోటును ఆశిస్తున్న ఆతిథ్య జట్టుకు ఈ సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేయడం చాలా అవసరం.


సమస్యల వలయంలో..

తొలి టెస్టుకు ముందే కివీస్‌ జట్టును సమస్యలు చుట్టుముట్టాయి. తమ ప్రధాన బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ ఈ టెస్టుకు దూరం కాగా పేసర్‌ బెన్‌ సియర్స్‌ గాయంతో సిరీస్‌ నుంచే తప్పుకొన్నాడు. అతడి స్థానంలో అన్‌క్యా్‌పడ్‌ జాకబ్‌ డఫీని తీసుకున్నారు. ఇక వీరి బ్యాటింగ్‌ విభాగం కూడా పేలవ ఫామ్‌తో ఉంది. లంక స్పిన్నర్ల ధాటికి ఒక్కరు కూడా సెంచరీ చేయలేకపోయారు. ఇక పదునైన భారత పేసర్లు, నాణ్యమైన స్పిన్నర్లను ఎదుర్కోవడం సవాల్‌గా మారనుంది. కొత్త కెప్టెన్‌ టామ్‌ లేథమ్‌, కాన్వే, మిచెల్‌ కూడా ఫామ్‌లో లేరు. బౌలింగ్‌లో కొత్త పేసర్‌ విల్‌ ఓరూర్కె, స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌పైనే జట్టు ఆశలు పెట్టుకుంది. కివీస్‌ ఇక్కడి చివరి పర్యటనలో ఎజాజ్‌ పదికి పది వికెట్లతో అబ్బురపరిచాడు. సీనియర్లు సౌథీ, శాంట్నర్‌ లంక టూర్‌లో ప్రభావం చూపలేదు. ఈ తరుణంలో భారత బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందిపెట్టాలంటే కివీస్‌ బౌలర్లు చెమటోడ్చాల్సిందే.


వరుణుడితో ఇబ్బందే

బెంగళూరులో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తొలి టెస్టు సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే మంగళవారం కురిసిన వర్షానికి ఇరు జట్ల ప్రాక్టీస్‌ కూడా రద్దయ్యింది. దీనికి తోడు బుధవారం కుంభవృష్టికి చాన్స్‌ ఉండడంతో ఎల్లో అలర్ట్‌ జారీ చేస్తూ స్థానిక పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో మొదటి రోజు ఆటగాళ్లు బరిలోకి దిగడం కష్టమే. రానున్న మూడు, నాలుగు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు చిన్నస్వామి స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉండడం అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశం.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), జైస్వాల్‌, గిల్‌/సర్ఫరాజ్‌, విరాట్‌, పంత్‌, రాహుల్‌, జడేజా, అశ్విన్‌, ఆకాశ్‌దీప్‌/కుల్దీ్‌ప, బుమ్రా, సిరాజ్‌.

న్యూజిలాండ్‌ : కాన్వే, లేథమ్‌ (కెప్టెన్‌), విల్‌ యంగ్‌, రచిన్‌, మిచెల్‌, బ్లండెల్‌, ఫిలిప్స్‌, శాంట్నర్‌/బ్రే్‌సవెల్‌, సౌథీ, ఓరూర్కీ, ఎజాజ్‌.


పిచ్‌

ఇక్కడి పిచ్‌ సహజంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంటుంది. అయితే వాతావరణ పరిస్థితి కారణంగా పిచ్‌ను కొన్ని రోజులుగా కవర్లతో కప్పి ఉంచారు. 2022లో ఈ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి టెస్టులో భారత్‌-శ్రీలంక జట్లు ముగ్గురేసి స్పిన్నర్లతో బరిలోకి దిగాయి.

Updated Date - Oct 16 , 2024 | 05:33 AM