ఐసీసీ అవార్డుల రేసులో బుమ్రా
ABN , Publish Date - Dec 31 , 2024 | 06:14 AM
అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో అదరగొడుతున్న భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ ఏడాది ఐసీసీ ఉత్తమ క్రికెటర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అలాగే టెస్ట్ క్రికెట్‌లో ఉత్తమ ఆటగాడి...

దుబాయ్: అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో అదరగొడుతున్న భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ ఏడాది ఐసీసీ ఉత్తమ క్రికెటర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అలాగే టెస్ట్ క్రికెట్‌లో ఉత్తమ ఆటగాడి పురస్కారానికీ అతడు పోటీపడుతున్నాడు. బుమ్రాతోపాటు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్, ఆ దేశానికే చెందిన యువ ఆటగాడు హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ ట్రావిస్ హెడ్ ‘క్రికెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో నిలిచారు. ఇక..బుమ్రా, శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్, రూట్, బ్రూక్ ఐసీసీ టెస్ట్ క్రికెటర్ అవార్డు రేసులో పోటీపడుతున్నాడు. ఇంకా భారత్ నుంచి మంధాన (మహిళల వన్డేలు), అర్ష్‌దీప్ సింగ్ (పురుషుల టీ20లు), శ్రేయాంక పాటిల్ (వర్ధమాన క్రికెటర్) కూడా ఐసీసీ పురస్కారాలకు నామినేట్ అయ్యారు.