Share News

బ్రూక్‌ ట్రిపుల్‌.. రూట్‌ డబుల్‌

ABN , Publish Date - Oct 11 , 2024 | 03:02 AM

పాకిస్థాన్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ చరిత్రాత్మక విజయంగా దిశగా దూసుకెళుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 492/3తో గురువారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. ట్రిపుల్‌ సెంచరీ హీరో హ్యారీ బ్రూక్‌ (322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్స్‌లతో 317), ద్విశతక వీరుడు జో రూట్‌ (375 బంతుల్లో 17 ఫోర్లతో 262)...

బ్రూక్‌ ట్రిపుల్‌..   రూట్‌ డబుల్‌

మహిళల వరల్డ్‌ కప్‌లో నేడు

ఆస్ట్రేలియా X పాకిస్థాన్‌, రాత్రి 7.30 నుంచి

బ్రూక్‌ ట్రిపుల్‌..

రూట్‌ డబుల్‌

ముల్తాన్‌: పాకిస్థాన్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ చరిత్రాత్మక విజయంగా దిశగా దూసుకెళుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 492/3తో గురువారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. ట్రిపుల్‌ సెంచరీ హీరో హ్యారీ బ్రూక్‌ (322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్స్‌లతో 317), ద్విశతక వీరుడు జో రూట్‌ (375 బంతుల్లో 17 ఫోర్లతో 262) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడడంతో 823/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన పాక్‌ నాలుగోరోజు ఆట చివరికి 6 వికెట్లకు 152 పరుగులు చేసింది.మొదటి ఇన్నింగ్స్‌లో 556 రన్స్‌ చేసిన పాక్‌.. ఇంకా 115 పరుగుల వెనుకంజలో ఉంది.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 823/7 డిక్లేర్డ్‌

పాక్‌ రెండో ఇన్నింగ్స్‌ 152/6


పురుషుల టెస్టు క్రికెట్‌లో అత్యధిక స్కోర్లు

శ్రీలంక 952/6 డిక్లేర్డ్‌ భారత్‌ కొలంబో 1997

ఇంగ్లండ్‌ 903/7 డిక్లేర్డ్‌ ఆస్ర్టేలియా ఓవల్‌ 1938

ఇంగ్లండ్‌ 849 వెస్టిండీస్‌ కింగ్‌స్టన్‌ 1930

ఇంగ్లండ్‌ 823/7 డిక్లేర్డ్‌ పాకిస్థాన్‌ ముల్తాన్‌ 2024

వెస్టిండీస్‌ 790/3 డిక్లేర్డ్‌ పాకిస్థాన్‌ కింగ్‌స్టన్‌ 1958

పురుషుల టెస్ట్‌ భాగస్వామ్యాల చరిత్రలో రూట్‌-బ్రూక్‌ నాలుగో అత్యధికాన్ని (4వ వికెట్‌కు 454) నమోదుచేశారు. సంగక్కర-జయవర్దనె 2006లో దక్షిణాఫ్రికాపై కొలంబోలో 624 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.

ఇంగ్లండ్‌ తరపున 34 ఏళ్ల తర్వాత...అంటే1990లో గ్రహమ్‌ గూచ్‌ తర్వాత ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా బ్రూక్‌ నిలిచాడు.

బ్రూక్‌ టెస్టుల్లో రెండో ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ (310 బంతుల్లో 300)ని నమోదుచేశాడు. సెహ్వాగ్‌ 278 బంతుల్లో సాధించి టాప్‌లో ఉన్నాడు.

Updated Date - Oct 11 , 2024 | 03:02 AM