Share News

శివకు కాంస్యం

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:08 AM

జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో సూర్యాపేట లిఫ్టర్‌ శివ లింగేశ్వరసాయి కాంస్య పతకం సాధించాడు. గత నెల 29న అరుణాచల్‌ప్రదేశ్‌ ఈటానగర్‌లో...

శివకు కాంస్యం

జాతీయ ‘లిఫ్టింగ్‌’

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో సూర్యాపేట లిఫ్టర్‌ శివ లింగేశ్వరసాయి కాంస్య పతకం సాధించాడు. గత నెల 29న అరుణాచల్‌ప్రదేశ్‌ ఈటానగర్‌లో మొదలైన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. శివ సీనియర్‌ కేటగిరీ 73 కిలోల విభాగంలో పతకం సాధించాడు. స్నాచ్‌లో 121, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 160, మొత్తంగా 281 కిలోల బరువెత్తి తృతీయ స్థానంలో నిలిచాడు. ఇదే పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌లిఫ్టర్లు 15 పతకాలు సాధించారు. ఓవరాల్‌ చాంపియన్‌షి్‌పనకు సంబంధించి ఏపీ బాలికలు... యూత్‌ విభాగంలో విన్నర్‌గా, జూనియర్‌ కేటగిరీలో రన్నర్‌పగా నిలిచారు.

Updated Date - Jan 08 , 2024 | 01:08 AM