Share News

భళా..భరాళీ బేదబ్రత్‌ భరాళీ

ABN , Publish Date - May 26 , 2024 | 04:33 AM

అసోం టీనేజ్‌ లిఫ్టర్‌ బేదబ్రత్‌ భరాళీ వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌లో అదరహో అనిపించాడు. ఏకంగా మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టాడు. పెరూలో శనివారం జరిగిన పురుషుల 73 కిలోల విభాగంలో...

భళా..భరాళీ బేదబ్రత్‌ భరాళీ

వరల్డ్‌ యూత్‌ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణాలు కైవసం

న్యూఢిల్లీ: అసోం టీనేజ్‌ లిఫ్టర్‌ బేదబ్రత్‌ భరాళీ వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌లో అదరహో అనిపించాడు. ఏకంగా మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టాడు. పెరూలో శనివారం జరిగిన పురుషుల 73 కిలోల విభాగంలో మొత్తం 296 కేజీలు (స్నాచ్‌ 136+క్లీన్‌ అండ్‌ జెర్క్‌ 160) బరువెత్తి ఓవరాల్‌ విభాగంలో స్వర్ణం సాధించాడు. ఇక, స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జెర్క్‌ విభాగా ల్లోనూ విజేతగా నిలిచిన మరో రెండు పసిడి పతకాలు అందుకున్నాడు. గత ఏడాది ఈ చాంపియన్‌షిప్‌లో 67 కిలోల విభాగంలో తలపడిన భరాళీ కాంస్యం గెలిచాడు. ఇక 81 కేజీల స్నాచ్‌ కేటగిరీలో సాయిరాజ్‌ పరదేశీ కాంస్య పతకం దక్కించుకున్నాడు.

Updated Date - May 26 , 2024 | 04:33 AM