ఒకే రోజు 16 వికెట్లు 106కే కుప్పకూలిన బంగ్లాదేశ్
ABN , Publish Date - Oct 22 , 2024 | 02:07 AM
బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం ఆరంభమైన తొలి టెస్టులో ఇరు జట్ల బౌలర్లు పండగ చేసుకున్నారు. ఏకంగా ఒకే రోజు 16 వికెట్లు నేలకూలాయి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య బంగ్లా...
ఢాకా: బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం ఆరంభమైన తొలి టెస్టులో ఇరు జట్ల బౌలర్లు పండగ చేసుకున్నారు. ఏకంగా ఒకే రోజు 16 వికెట్లు నేలకూలాయి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 40.1 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మహ్ముదుల్ (30) టాప్ స్కోరర్. వీరి అత్యధిక భాగస్వామ్యం (26) తొమ్మిదో వికెట్‌కు లభించడం గమనార్హం. పేసర్లు రబాడ, ముల్డర్, స్పిన్నర్ కేశవ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. అలాగే రెండో సెషన్‌లోనే బరిలోకి దిగిన సౌతాఫ్రికా వెలుతురులేమితో ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 140 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 34 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుండగా.. క్రీజులో కైల్ వెరైన్ (18 బ్యాటింగ్), ముల్డర్ (17 బ్యాటింగ్) ఉన్నారు. స్పిన్నర్ తైజుల్‌కు ఐదు వికెట్లు లభించాయి. కాగా టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో (11,817)నే 300 వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడ నిలిచాడు. పాక్ దిగ్గజం వఖార్ యూనిస్ (12,602)ను అధిగమించాడు.