Share News

సరీస్‌ లంక వశం రెండో టెస్ట్‌లోనూ ఓడిన బంగ్లా

ABN , Publish Date - Apr 04 , 2024 | 01:41 AM

బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో శ్రీలంక 192 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో రెండు టెస్ట్‌ల సిరీ్‌సను 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. 511 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా...

సరీస్‌ లంక వశం రెండో టెస్ట్‌లోనూ ఓడిన బంగ్లా

చట్టోగ్రామ్‌: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో శ్రీలంక 192 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో రెండు టెస్ట్‌ల సిరీ్‌సను 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. 511 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా.. ఆటకు ఆఖరి, ఐదో రోజైన బుధవారం ఓవర్‌నైట్‌ స్కోరు 268/7తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లా 318 పరుగులకు ఆలౌటైంది. మెహ్దీహసన్‌ మిరాజ్‌ (81 నాటౌట్‌) పోరాటం వృథా అయింది. లాహిరు కుమార 4, కమిందు మెండిస్‌ 3 వికెట్లు తీశారు. లంక 531, 157/7 డిక్లేర్‌ చేయగా.. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు కుప్పకూలింది. మొదటి టెస్ట్‌లో 328 రన్స్‌తో గెలిచిన లంక.. బంగ్లాలో టెస్ట్‌ ఓడని రికార్డును నిలబెట్టుకొంది.

Updated Date - Apr 04 , 2024 | 01:42 AM