Share News

Australian Open : రోహన్‌ సాధించెన్‌!

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:12 AM

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆసాంతం అదరగొట్టిన రోహన్‌ బోపన్న టోర్నీకి అద్భుత ముగింపునిచ్చాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎడ్బెన్‌ జతగా బరిలోకి దిగిన బోపన్న..డబుల్స్‌ టైటిల్‌ను అందుకున్నాడు. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రెండో సీడ్‌ బోపన్న/ఎడ్బెన్‌ జోడీ 7-6 (0), 7-5తో ఇటలీ ద్వయం

Australian Open : రోహన్‌ సాధించెన్‌!

పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌

మెద్వెదెవ్‌ X సిన్నర్‌

మ. 2 గం.నుంచి సోనీ నెట్‌వర్క్‌లో...

డబుల్స్‌ చాంపియన్‌ బోపన్న

పెద్ద వయస్సులో విజేతగా రికార్డు

రెండేళ్ల కిందట ఓ వీడియో మెసేజ్‌ విడుదల చేశా. అప్పటికి మ్యాచ్‌లు గెలవక ఐదు నెలలు అయింది. దాంతో రిటైర్మెంట్‌ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని భావించా. కానీ నాలో ఏదో శక్తి. దానికి పట్టుదల తోడై ఆ పయనం ఇప్పటిదాకా సాగింది. ఎడ్బెన్‌ రూపంలో అమోఘమైన భాగస్వామి లభించాడు. అతడి సహకారంతో ఈ ఘనత సాధించా.

-బోపన్న

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహన్‌ బోపన్న ఎట్టకేలకు సాధించాడు. డబుల్స్‌లో చాంపియన్‌గా నిలవాలన్న అతని స్వప్నం 43 ఏళ్ల లేటు వయసులో సాకారమైంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఫైనల్‌ సాగినా ఈ వెటరన్‌ స్టార్‌ వెరవలేదు..పోరాట స్ఫూర్తికి మారుపేరైన రోహనే అంతిమంగా విజేతగా నిలిచాడు..ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ చాంపియన్‌షి్‌ప దక్కించుకోవడం ద్వారా పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు..

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆసాంతం అదరగొట్టిన రోహన్‌ బోపన్న టోర్నీకి అద్భుత ముగింపునిచ్చాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎడ్బెన్‌ జతగా బరిలోకి దిగిన బోపన్న..డబుల్స్‌ టైటిల్‌ను అందుకున్నాడు. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రెండో సీడ్‌ బోపన్న/ఎడ్బెన్‌ జోడీ 7-6 (0), 7-5తో ఇటలీ ద్వయం సిమోన్‌ బొలెలి/ఆండ్రియా వవసోరిపై విజయం సాధించింది. తద్వారా ఓపెన్‌ ఎరా (1968 నుంచి) పురుషుల విభాగంలో అత్యధిక వయస్సు (43 ఏళ్ల 329 రోజులు)లో గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన ప్లేయర్‌గా రోహన్‌ చరిత్ర సృష్టించాడు. ఈక్రమంలో జులియన్‌ రోజర్‌ (40 ఏళ్ల 270 రో.) పేరిట ఉన్న రికార్డును బద్దలుగొట్టాడు. అలాగే గ్రాండ్‌స్లామ్‌లో పురుషుల డబుల్స్‌ చాంపియన్‌గా నిలిచిన మూడో భారత ప్లేయర్‌గా బోపన్న మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో లియాండర్‌ పేస్‌/మహేశ్‌ భూపతి పురుషుల్లో, సానియా మీర్జా మహిళల్లో గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించారు. ఇక బోపన్నకిది రెండో గ్రాండ్‌స్లామ్‌ కావడం విశేషం. డబ్రోవస్కీ (కెనడా)తో కలిసి 2017లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ టైటిల్‌ను గెలిచాడు. ఇక గంటా 39 ని. జరిగిన టైటిల్‌పోరులో ఒకే ఒక సర్వీస్‌ బ్రేక్‌ చోటుచేసుకోవడం గమనార్హం. రెండో సెట్‌ 11వ గేమ్‌లో ‘లవ్‌’ వద్ద వవసోరి తన సర్వీ్‌సను చేజార్చుకున్నాడు. నువ్వా..నేనా అన్నట్టు సాగిన మొదటి సెట్‌ టైబ్రేకర్‌కు వెళ్లింది. అయితే టైబ్రేకర్‌లో ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా రోహన్‌/ఎడ్బెన్‌ జోడీ జయకేతనం ఎగుర వేసింది. రెండో సెట్‌లో ఇటలీ ద్వయం మరింత పోరాడడంతో ఈ సెట్‌కూడా రసవత్తరంగా మారింది. కానీ అంతిమంగా రోహన్‌ జోడీనే విజయం వరించింది.

Bopanna-family.jpg

సోమవారం ప్రకటించే వరల్డ్‌ రాం్యకింగ్స్‌ డబుల్స్‌ కేటగిరిలో రోహన్‌ బోపన్న నెం.1 ర్యాంక్‌కు చేరనున్నాడు. 43 ఏళ్ల వయస్సులో టాప్‌ ర్యాంక్‌ కైవసం చేసుకోనున్న ఆటగాడిగా మరో ఘనత సాధించనున్నాడు.

sabalenka.jpg

సబలెంక రెండోసారి..

బెలారస్‌ భామ అరైనా సబలెంక మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను వరుసగా రెండోసారి గెలిచింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో రెండో సీడ్‌ సబలెంక 6-3, 6-2తో 12వ సీడ్‌ జెంగ్‌ క్విన్‌వెన్‌ (చైనా)ను చిత్తు చేసింది. తొలి సెట్‌లో 5-1తో సబలెంక తిరుగులేని స్థితిలో నిలిచినా ఏడో గేమ్‌లో జెంగ్‌ కాసింత పోరాడింది. కానీ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా సబలెంక ఆ సెట్‌ను నెగ్గింది. ఇక రెండో సెట్‌లో ముఖ్యంగా అద్భుతమైన సర్వీస్‌తో మరింత విజృంభించిన అరైనా..సెట్‌ను ఇంకా సునాయాసంగా నెగ్గింది.

Updated Date - Jan 28 , 2024 | 01:12 AM