Share News

T20 World Cup: స్టీవ్ స్మిత్‌కు నో ప్లేస్.. మిచెల్ మార్ష్‌కు కెప్టెన్సీ.. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ టీమ్ ఇదే..!

ABN , Publish Date - May 01 , 2024 | 09:35 AM

త్వరలో వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనున్న టీ-20 ప్రపంచకప్ కోసం అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 15 మందితో కూడా ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. పదేళ్లుగా ఆస్ట్రేలియా జట్టులో కీలక పాత్ర పోషిస్తూ అన్ని ఐసీసీ ఈవెంట్లలోనూ ఆడుతున్న స్టీవ్ స్మిత్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సారి షాకిచ్చింది.

T20 World Cup: స్టీవ్ స్మిత్‌కు నో ప్లేస్.. మిచెల్ మార్ష్‌కు కెప్టెన్సీ.. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ టీమ్ ఇదే..!
Steve Smith

త్వరలో వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనున్న టీ-20 ప్రపంచకప్ (T20 World Cup) కోసం అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 15 మందితో కూడా ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. పదేళ్లుగా ఆస్ట్రేలియా జట్టులో కీలక పాత్ర పోషిస్తూ అన్ని ఐసీసీ ఈవెంట్లలోనూ ఆడుతున్న స్టీవ్ స్మిత్‌కు (Steve Smith) క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సారి షాకిచ్చింది. టీ-20 ప్రపంచకప్-2024కు స్మిత్‌ను ఎంపిక చేయలేదు. అలాగే ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2024) రాణిస్తున్న ఫ్రేజర్ మెక్‌గర్క్‌కు కూడా చోటు దక్కలేదు.


క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. 15 మందితో కూడిన టీమ్‌ను మిచెల్ మార్ష్ (Mitchell Marsh) నడిపించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉన్న ఆష్టన్ అగార్, కామెరాన్ గ్రీన్ లాంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో ప్రస్తుత ఐపీఎల్‌లో చెలరేగి ఆడుతున్న జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌ను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే 2014 తర్వాత స్మిత్ లేకుండా ఆస్ట్రేలియా ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.


ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ జట్టు (Australia T20 World Cup squad):

మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆష్టన్ అగార్, ప్యాట్ కమిన్స్, టిమ డేవిడ్, నేథన్ ఎలిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

ఇవి కూడా చదవండి..

ICC T20 World Cup India's Team: టీ20 వరల్డ్ కప్ ఇండియా టీమ్ ఇదే..


IPL 2024: పాయింట్ల పట్టికలో CSKను వెనక్కి నెట్టి టాప్ 3లోకి లక్నో


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 01 , 2024 | 09:35 AM