Share News

సెమీ్‌సకొస్తే.. భారత్‌ ఆడేది గయానాలో

ABN , Publish Date - May 15 , 2024 | 01:57 AM

అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్‌ కప్‌ ‘ప్లేయింగ్‌ కండీషన్స్‌’ను ఐసీసీ మంగళవారం విడుదలజేసింది. టీమిండియా కనుక నాకౌట్‌కు చేరితే రెండో సెమీఫైనల్‌ ఆడుతుంది. జూన్‌ 27న గయానాలో...

సెమీ్‌సకొస్తే.. భారత్‌ ఆడేది గయానాలో

టీ20 ప్రపంచ కప్‌

న్యూఢిల్లీ: అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్‌ కప్‌ ‘ప్లేయింగ్‌ కండీషన్స్‌’ను ఐసీసీ మంగళవారం విడుదలజేసింది. టీమిండియా కనుక నాకౌట్‌కు చేరితే రెండో సెమీఫైనల్‌ ఆడుతుంది. జూన్‌ 27న గయానాలో రెండో సెమీస్‌ జరుగుతుంది. కాగా, జూన్‌ 29న బార్బడో్‌సలో జరిగే ఫైనల్‌కు రిజర్వ్‌ డే (జూన్‌ 30)ను ఏర్పాటు చేశారు. ట్రినిడాడ్‌, గయానా సమయాలను ఆధారం చేసుకొని భారత్‌ రెండో సెమీఫైనల్‌ ఆడేలా ఐసీసీ నిర్ణయించింది. తొలి సెమీఫైనల్‌ జూన్‌ 26న ట్రినిడాడ్‌ సమయం ప్రకారం రాత్రి 8.30కి ప్రారంభమవుతుంది. అంటే జూన్‌ 27న భారత సమయం ప్రకారం ఉదయం 6.30కి ఈ మ్యాచ్‌ మొదలవుతుంది. ఇక గయానాలో నిర్వహించే రెండో సెమీస్‌ వారి సమయం ప్రకారం ఉదయం 10.30కి మొదలవుతుంది. అంటే..భారత కాలమానం ప్రకారం రాత్రి 8గం.కు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. భారత క్రికెట్‌ ఫ్యాన్స్‌కు సౌకర్యంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ వివరించింది. వాతావరణ అవరోధాలను అధిగమించేందుకు.. రెండు సెమీఫైనల్స్‌కు 250 నిమిషాల చొప్పున అదనపు సమయం కేటాయించారు.

Updated Date - May 15 , 2024 | 01:57 AM