అర్శిన్ అదిరే శతకం
ABN , Publish Date - Jan 29 , 2024 | 05:37 AM
అర్శిన్ కులకర్ణి (108) శతకంతోపాటు నమన్ తివారి (4/20) నాలుగు వికెట్లతో విజృంభించడంతో.. అండర్-19 వరల్డ్‌కప్ లీగ్ దశను భారత్ క్లీన్‌స్వీ్‌ప చేసింది. తొలి రెండు వన్డేల్లో నెగ్గి...
నమన్‌కు 4 వికెట్లు
యూఎ్‌సపై భారత్ ఘన విజయం
అండర్ -19 వరల్డ్‌కప్
బ్లూమ్‌ఫోంటీన్: అర్శిన్ కులకర్ణి (108) శతకంతోపాటు నమన్ తివారి (4/20) నాలుగు వికెట్లతో విజృంభించడంతో.. అండర్-19 వరల్డ్‌కప్ లీగ్ దశను భారత్ క్లీన్‌స్వీ్‌ప చేసింది. తొలి రెండు వన్డేల్లో నెగ్గి ఈపాటికే సూపర్-6 బెర్త్‌ను ఖరారు చేసుకొన్న భారత్.. వరుసగా మూడో విజయంతో గ్రూప్-ఎ టాపర్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మూడో, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 201 పరుగుల తేడాతో అమెరికాను చిత్తు చేసింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగుల భారీస్కోరు చేసింది. కులకర్ణి, ముషీర్ (73) రెండో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. కెప్టెన్ ఉదయ్ సహరన్ (35), ప్రియాన్షు (27), సచిన్ దాస్ (20) దూకుడుగా ఆడారు. ఛేదనలో యూఎస్ ఓవర్లన్నీ ఆడి 125/8 స్కోరు మాత్రమే చేసింది. ఇదే గ్రూప్ నుంచి బంగ్లాదేశ్, ఐర్లాండ్ సూపర్-6కు అర్హత సాధించాయి.