Share News

వెలుతురులేమిపై వాగ్వాదం

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:50 AM

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌కు దిగాక కేవలం నాలుగు బంతుల్లోనే ఆటను ఆపేశారు. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో అంపైర్లు లైట్‌ మీటర్‌ చెక్‌ చేసి వెలుతురులేమితో...

వెలుతురులేమిపై వాగ్వాదం

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌కు దిగాక కేవలం నాలుగు బంతుల్లోనే ఆటను ఆపేశారు. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో అంపైర్లు లైట్‌ మీటర్‌ చెక్‌ చేసి వెలుతురులేమితో నాలుగో రోజు ఆటను ముగిస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే కివీస్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు వెళ్లారు. అయితే భారత కెప్టెన్‌ రోహిత్‌ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెలుతురు బాగానే ఉంది కదా అని ఆకాశానికేసి చూపిస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. రోహిత్‌కు కోహ్లీ కూడా కలిశాడు. పిచ్‌ బౌలింగ్‌కు సహకరిస్తుండడంతో వేగంగా వికెట్లు తీయాలనేది భారత్‌ ఉద్దేశం. అప్పటికి మ్యాచ్‌కు ఇంకా 15 నిమిషాల సమయం ఉంది. కానీ అంపైర్లు ససేమిరా అనడంతో పాటు కాసేపటికే భారీ వర్షం కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు.

Updated Date - Oct 20 , 2024 | 01:50 AM