Share News

కేన్‌ మరో శతకం

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:22 AM

కేన్‌ విలియమ్సన్‌ (109) రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకంతో చెలరేగడంతో.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్‌ పట్టుబిగించింది. 349 పరుగుల భారీ ఆధిక్యంతో

కేన్‌ మరో శతకం

కివీస్‌ ఆధిక్యం 528 పరుగులు

సౌతాఫ్రికాతో తొలి టెస్టు

మౌంట్‌ మాంగనుయ్‌: కేన్‌ విలియమ్సన్‌ (109) రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకంతో చెలరేగడంతో.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్‌ పట్టుబిగించింది. 349 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన కివీస్‌ మూడో రోజు ఆట ముగిసేసరికి 179/4 స్కోరు చేసింది. డారెల్‌ మిచెల్‌ (11), బ్లండెల్‌ (5) క్రీజులో ఉన్నారు. నీల్‌ బ్రాండ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ 528 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 80/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌతాఫ్రికా 162 రన్స్‌కు కుప్పకూలింది. కేగన్‌ పీటర్సన్‌ (45) టాప్‌ స్కోరర్‌. హెన్రీ, శాంట్నర్‌ చెరో 3 వికెట్లు తీశారు. అయితే, ప్రత్యర్థిని ఫాలో ఆన్‌ ఆడించడానికి కివీస్‌ నిరాకరించింది. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 511 పరుగులు చేసింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లోనూ 118 రన్స్‌ చేసిన విలియమ్సన్‌.. ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు చేసిన ఐదో కివీస్‌ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

Updated Date - Feb 07 , 2024 | 04:22 AM