అమన్ పసిడి పట్టు
ABN , Publish Date - Jan 12 , 2024 | 02:00 AM
భారత రెజ్లర్ అమన్ షెహ్రావత్ జాగ్రెబ్ ఓపెన్‌లో స్వర్ణ పతకంతో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన 57 కిలోల ఫైనల్లో అమన్ 10-0తో వరల్డ్ నెంబర్ 7 వాన్‌హో జౌ (చైనా)ను చిత్తుగా...

జాగ్రెబ్: భారత రెజ్లర్ అమన్ షెహ్రావత్ జాగ్రెబ్ ఓపెన్‌లో స్వర్ణ పతకంతో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన 57 కిలోల ఫైనల్లో అమన్ 10-0తో వరల్డ్ నెంబర్ 7 వాన్‌హో జౌ (చైనా)ను చిత్తుగా ఓడించాడు. దీపక్ పూనియా 86 కిలోల విభాగంలో తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. ఇక, డబ్ల్యూఎఫ్‌ఐపై సస్పెన్షన్ ఉండడంతో ప్రస్తుతం భారత రెజ్లర్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ తరఫున ఈ పోటీల్లో బరిలోకి దిగారు.