Share News

రిత్విక్‌ జోడీకి ‘అల్మాటీ’ టైటిల్‌

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:32 AM

తెలుగు టెన్నిస్‌ ఆటగాడు బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరి అంతర్జాతీయ టోర్నీలో సత్తా చాటాడు. భారత్‌కే చెందిన అర్జున్‌ ఖడే జతగా అల్మాటీ ఓపెన్‌ టైటిల్‌

రిత్విక్‌ జోడీకి ‘అల్మాటీ’ టైటిల్‌

న్యూఢిల్లీ: తెలుగు టెన్నిస్‌ ఆటగాడు బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరి అంతర్జాతీయ టోర్నీలో సత్తా చాటాడు. భారత్‌కే చెందిన అర్జున్‌ ఖడే జతగా అల్మాటీ ఓపెన్‌ టైటిల్‌ గెలిచాడు. ఆదివారం కజకిస్థాన్‌లో జరిగిన ఫైనల్లో రిత్విక్‌-అర్జున్‌ ద్వయం 3-6, 7-6, 14-12తో నికోలస్‌ (కొలంబియా)-స్కందర్‌ మన్‌సౌరి (ట్యునీషియా) జోడీని ఓడించింది.

Updated Date - Oct 21 , 2024 | 12:32 AM