Share News

కళ్లన్నీ నీరజ్‌పైనే..

ABN , Publish Date - May 12 , 2024 | 02:12 AM

చాలా సంవత్సరాల తర్వాత ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప స్టార్‌ కళ సంతరించుకుంటోంది. జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఆదివారం ఇక్కడ ప్రారంభమయ్యే...

కళ్లన్నీ నీరజ్‌పైనే..

నేటినుంచి ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌

భువనేశ్వర్‌: చాలా సంవత్సరాల తర్వాత ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప స్టార్‌ కళ సంతరించుకుంటోంది. జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఆదివారం ఇక్కడ ప్రారంభమయ్యే ఈ నాలుగు రోజుల మీట్‌లో తలపడబోతున్నాడు. 2021 తర్వాత స్వదేశంలో ఓ చాంపియన్‌షి్‌ప బరిలో నీరజ్‌ తొలిసారి బరిలో దిగనుండడం విశే షం. 14న పురుషుల జావెలిన్‌ త్రో క్వాలిఫికేషన్‌ రౌండ్‌, 15న ఫైనల్‌ జరుగుతాయి. షాట్‌పుటర్‌ తజిందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌, కిశోర్‌ జెనా (జావెలిన్‌ త్రో), అమోజ్‌ జాకబ్‌, మహ్మద్‌ అజ్మల్‌ (పురుషుల 400మీ.), జస్విన్‌ ఆల్ర్డిన్‌ (పురుషుల లాంగ్‌జంప్‌), ప్రవేణ్‌ చిత్రవేల్‌, అబూబాకర్‌ (పురుషుల ట్రిపుల్‌జంప్‌)తోపాటు తెలుగు రన్నర్‌ జ్యోతిశ్రీ దండిక మహిళల 4గీ400మీ. రిలేలో పాల్గొంటోంది.

Updated Date - May 12 , 2024 | 02:12 AM