Share News

నడాల్‌పైనే కళ్లన్నీ

ABN , Publish Date - May 26 , 2024 | 04:29 AM

గాయంతో టెన్నిస్‌ నుంచి విరా మం తీసుకొన్న స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ ఏడాది తర్వాత మళ్లీ అభిమానులను అలరించనున్నాడు. ఆదివారం నుంచి జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అతడు బరిలోకి దిగనున్నాడు. డిఫెండింగ్‌ చాంప్‌, వరల్డ్‌ నెం.1 జొకోవిచ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా...

నడాల్‌పైనే కళ్లన్నీ

నేటినుంచే ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: గాయంతో టెన్నిస్‌ నుంచి విరా మం తీసుకొన్న స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ ఏడాది తర్వాత మళ్లీ అభిమానులను అలరించనున్నాడు. ఆదివారం నుంచి జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అతడు బరిలోకి దిగనున్నాడు. డిఫెండింగ్‌ చాంప్‌, వరల్డ్‌ నెం.1 జొకోవిచ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. అందరి దృష్టి మాత్రం నడాల్‌పైనే ఉంది. ఈ క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్‌లో రికార్డుస్థాయిలో 14సార్లు విజేతగా నిలిచిన నడాల్‌ కొన్నాళ్లుగా ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్నాడు. మునపటి స్థాయిలో ఆడలేకపోతున్న అతడికిదే చివరి గ్రాండ్‌స్లామ్‌ కావొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి ఆటను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశముంది. అయితే, తొలిరౌండ్‌లోనే 4వ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ రూపంలో నడాల్‌కు కఠిన సవాల్‌ ఎదురుకానుంది. రెండో సీడ్‌ సిన్నర్‌, అల్కరజ్‌, మెద్వెదెవ్‌ కూడా టైటిల్‌ నెగ్గాలనే పట్టుదలతో ఉన్నారు. మహిళల్లో డిఫెండింగ్‌ చాంప్‌ స్వియటెక్‌ నాలుగో టైటిల్‌పై గురిపెట్టింది. ఇక్కడ 2020, 2022, 2023లో విజేతగా నిలిచిన స్వియటెక్‌ తొలి రౌండ్‌లో లియోలినాతో తలపడనుంది. సబలెంక, కొకొ గాఫ్‌ నుంచి స్వియటెక్‌కు గట్టిపోటీ ఎదురవనుంది. తల్లయిన ఒసాక 15 నెలల విరామం తర్వాత ఈ టోర్నీతో మళ్లీ రాకెట్‌ పట్టనుంది.

Updated Date - May 26 , 2024 | 04:29 AM