అందరూ మహిళలే
ABN , Publish Date - Sep 25 , 2024 | 12:33 AM
టీ20 ఉమెన్ వరల్డ్‌కప్ కోసం పూర్తిగా మహిళలతో కూడిన ప్యానెల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. మొత్తం 13 మంది మ్యాచ్ అఫీషియల్స్‌లో 10 మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రెఫరీలు ఉన్నారు...
టీ20 వరల్డ్‌కప్ అంపైర్ల ప్యానెల్
దుబాయ్: టీ20 ఉమెన్ వరల్డ్‌కప్ కోసం పూర్తిగా మహిళలతో కూడిన ప్యానెల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. మొత్తం 13 మంది మ్యాచ్ అఫీషియల్స్‌లో 10 మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రెఫరీలు ఉన్నారు. భారత్‌నుంచి తెలుగు మహిళ జీఎస్ లక్ష్మి మ్యాచ్ రెఫరీగా, వ్రింద రాఠీ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. వచ్చే నెల 3 నుంచి యూఏఈ వేదికగా పొట్టికప్ జరగనుంది. కాగా, గత నాలుగు మెగా టోర్నీలకు పనిచేసిన క్లైరీ పొలోసక్‌కు ప్యానెల్‌లో అత్యధిక అనుభవం ఉంది. జింబాబ్వేకు చెందిన సారా డామ్‌బనేవనాకు తొలిసారి టీ20 వరల్డ్‌క్‌పలో అంపైరింగ్ చేసే చాన్స్ దక్కనుంది.