సిక్కులకు అక్మల్ క్షమాపణ
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:27 AM
పాకిస్థాన్‌తో మ్యా చ్ సందర్భంగా ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తీరా అది వివాదాస్పదం కావడంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను...

ప్రపంచకప్‌లో నేటి మ్యాచ్‌లు
శ్రీలంక X నేపాల్ (ఉ.5. గం.)
ఆస్ట్రేలియా X నమీబియా (ఉ.6. గం.)
భారత్ X అమెరికా (రాత్రి 8. గం.)
కరాచీ: పాకిస్థాన్‌తో మ్యా చ్ సందర్భంగా ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తీరా అది వివాదాస్పదం కావడంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను అర్ష్‌దీప్ వేయగా.. పాక్ విజయానికి 18 పరుగులు అవసరమయ్యాయి. అయితే స్థానిక టీవీ డిబేట్‌లో పాల్గొన్న కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ.. ‘అర్ష్‌దీప్ ఓవర్ కాబట్టి మ్యాచ్‌లో ఏవైనా జరగొచ్చు. ఎందుకంటే రాత్రి 12 గంటలైంది కదా’ అంటూ సర్దార్జీలపై ఉండే జోక్‌లనుద్దేశిస్తూ ఎద్దేవా చేశాడు. అటు ఈ కామెంట్స్‌ను మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా తప్పుపట్టాడు. ‘అనుచితంగా మాట్లాడే ముందు సిక్కుల చరిత్ర తెలుసుకో. ఆక్రమణదారులు మీ తల్లులను, సోదరీమణులను ఎత్తుకెళ్లినప్పుడు వారిని కాపాడింది సిక్కులే.
అప్పుడు సమయం రాత్రి 12 గంటలే అయ్యింది. నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది’ అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించాడు. ఈనేపథ్యంలో కమ్రాన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. ‘నా కామెంట్స్‌పై విచారం వ్యక్తం చేస్తూ హర్భజన్‌తో పాటు సిక్కు సమాజానికి క్షమాపణలు చెబుతున్నాను. నేనలా మాట్లాడాల్సిందికాదు’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.