Share News

LSG vs DC: తడబడి తేరుకున్న లక్నో.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు మోస్తరు లక్ష్యం!

ABN , Publish Date - Apr 12 , 2024 | 09:34 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాటర్లు తడబడ్డారు. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అయితే 8వ వికెట్‌కు యువ బ్యాటర్ ఆయుశ్ బదోనీ (55 నాటౌట్), ఆర్షద్ ఖాన్ (20 నాటౌట్) ఏకంగా 73 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం లక్ష్యం 168 పరుగులుగా ఉంది.

LSG vs DC: తడబడి తేరుకున్న లక్నో.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు మోస్తరు లక్ష్యం!

లక్నో: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాటర్లు తడబడ్డారు. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అయితే 8వ వికెట్‌కు యువ బ్యాటర్ ఆయుశ్ బదోనీ (55 నాటౌట్), ఆర్షద్ ఖాన్ (20 నాటౌట్) ఏకంగా 73 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం లక్ష్యం 168 పరుగులుగా ఉంది.

కుర్రాళ్లు ఆయుశ్ బదోనీ (55 నాటౌట్), ఆర్షద్ ఖాన్ (20 నాటౌట్) అదుర్స్ అనిపించారు. స్టార్ బ్యాటర్లు త్వరగా ఔట్ అయిన పిచ్‌పై అలవోకగా పరుగులు రాబట్టారు. బదోని 35 బంతుల్లో 55 పరుగులు రాబట్టాడు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.


ఢిల్లీ క్యాపిటల్ బౌలర్లలో స్పిన్పర్ కుల్దీప్ యాదవ్ చెలరేగాడు. 4 ఓవర్లు వేసి కేవలం 20 పరుగులు మాత్రమే 3 అత్యంత కీలకమైన వికెట్లు తీశాడు. డేంజర్ బ్యాటర్లు మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పెవీలియన్‌కు పంపాడు. మిగతా బ్యాటర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, ఇశాంత్ శర్మ, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీశారు. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.

Updated Date - Apr 12 , 2024 | 09:43 PM