Share News

60 ఏళ్ల తర్వాత ..

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:22 AM

అరవై ఏళ్ల తర్వాత భారత డేవిస్‌కప్‌ జట్టు తొలిసారి పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది. డేవిస్‌ కప్‌ గ్రూప్‌-1 ప్లేఆఫ్స్‌లో భాగంగా వచ్చేనెల 3, 4 తేదీల్లో పాక్‌తో భారత్‌ తలపడ నుంది...

60 ఏళ్ల తర్వాత ..

  • పాక్‌లో భారత డేవిస్‌ కప్‌ జట్టు

  • అధ్యక్ష తరహా భద్రత

ఇస్లామాబాద్‌: అరవై ఏళ్ల తర్వాత భారత డేవిస్‌కప్‌ జట్టు తొలిసారి పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది. డేవిస్‌ కప్‌ గ్రూప్‌-1 ప్లేఆఫ్స్‌లో భాగంగా వచ్చేనెల 3, 4 తేదీల్లో పాక్‌తో భారత్‌ తలపడ నుంది. ఆదివారం రాత్రి ఇక్కడకు చేరుకొన్న ఐదుగురు సభ్యుల భారత జట్టుకు అధ్యక్ష తరహా భద్రతను కల్పించారు. ప్లేయర్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవడంతో.. ఎక్కడా రాజీపడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు పాకిస్థాన్‌ టెన్నిస్‌ సమాఖ్య తెలిపింది. భారత బృందం చుట్టూ నాలుగు లేదా ఐదంచెల భద్రతా వలయం ఉంటుందని చెప్పింది. 1964లో చివరిసారి భారత డేవిస్‌కప్‌ జట్టు పాక్‌లో పర్యటించింది. 1973, 2019లో తటస్థ వేదికలపై పాక్‌తో తలపడింది. అయితే, ఈసారి వేదికను మార్చాలని అఖిల భారత టెన్నిస్‌ సమాఖ్య తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యపడలేదు.

Updated Date - Jan 30 , 2024 | 03:22 AM