Share News

అదితి తల్లిదండ్రుల ‘సూట్‌’ కష్టాలు

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:25 AM

క్రీడా అవార్డుల ప్రదానోత్సవం కోసం ఇక్కడకు వచ్చిన యువ ఆర్చర్‌ అదితి గోపీచంద్‌ తల్లిదండ్రులు వణికిస్తున్న చలిలో ఢిల్లీ వీధుల్లో ‘సూట్‌’ కొనుక్కునే పనిలో పడ్డారు...

అదితి తల్లిదండ్రుల ‘సూట్‌’ కష్టాలు

న్యూఢిల్లీ: క్రీడా అవార్డుల ప్రదానోత్సవం కోసం ఇక్కడకు వచ్చిన యువ ఆర్చర్‌ అదితి గోపీచంద్‌ తల్లిదండ్రులు వణికిస్తున్న చలిలో ఢిల్లీ వీధుల్లో ‘సూట్‌’ కొనుక్కునే పనిలో పడ్డారు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం జరిగే కార్యక్రమంలో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అదితి అర్జున అవార్డును అందుకోనుంది. దీన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మహారాష్ట్రలోని సతార నుంచి ఆమె తల్లిదండ్రులు గోపీచంద్‌, షైలా స్వామి వచ్చారు. అయితే, అవార్డుల కార్యక్రమానికి హాజరుకావాలంటే ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ పాటించాలని ఢిల్లీ వచ్చాకే వారికి తెలిసిందట. దీంతో తగిన దుస్తుల కోసం ఢిల్లీలోని పాలికా బజార్‌లో షాపింగ్‌ చేస్తున్నట్టు తెలిపాడు. అదితి తండ్రి ఓ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 03:25 AM