Share News

Archer : దీపికా కుమారికి మళ్లీ నిరాశే!

ABN , Publish Date - May 27 , 2024 | 04:25 AM

పునరాగమనం తర్వాత వరల్డ్‌కప్‌ పతకం సాధించాలనుకొన్న ఏస్‌ ఆర్చర్‌ దీపిక కుమారికి మరోసారి నిరాశే ఎదురైంది. వరల్డ్‌కప్‌ స్టేజ్‌-2లో పతకం సాధించకుండానే

Archer : దీపికా కుమారికి మళ్లీ నిరాశే!

యెచియాన్‌ (కొరియా): పునరాగమనం తర్వాత వరల్డ్‌కప్‌ పతకం సాధించాలనుకొన్న ఏస్‌ ఆర్చర్‌ దీపిక కుమారికి మరోసారి నిరాశే ఎదురైంది. వరల్డ్‌కప్‌ స్టేజ్‌-2లో పతకం సాధించకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ఆదివారం జరిగిన రిక్వర్‌ మహిళల వ్యక్తిగత విభాగం సెమీ్‌సలో దీపిక 2-6తో వరల్డ్‌ నెం.2 లిమ్‌ షియాన్‌ (కొరియా) చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత జరిగిన కాంస్య పతక పోరులోనూ దీపిక 4-6తో అలెజాండ్రా వెలెన్సియా (మెక్సికో) చేతిలో ఓడింది.

Updated Date - May 27 , 2024 | 04:25 AM