వినేశ్, బజరంగ్ రాజీనామాల ఆమోదం
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:03 AM
రాజకీయాల్లో చేరిన స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పూనియా తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వీటిని వెంటనే ఆమోదించినట్టు నార్తర్న్ రైల్వే శాఖ పేర్కొంది...
రైల్వే శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ: రాజకీయాల్లో చేరిన స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పూనియా తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వీటిని వెంటనే ఆమోదించినట్టు నార్తర్న్ రైల్వే శాఖ పేర్కొంది. అలాగే ఈ ఇద్దరి విషయంలో మూడు నెలల నోటీస్ పీరియడ్‌ను కూడా ఎత్తివేసినట్టు తెలిపింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీరికి మార్గం సుగమమైంది. గతవారమే ఇద్దరు రెజ్లర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.